MLC election notification for Telugu states తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్

Ec releases schedule for mlc 2019 elections in telangana and andhra pradesh

MLC election, MLC election Notification, CM KCR, CM Chandrababu, TDP, TRS, Congress, YSRCP, Telangana, Andhra Pradesh, Politics

The Election Commission of India has released the schedule for the MLC elections in Telangana and Andhra Pradesh on Monday evening. The schedule is released for the five MLC seats under MLCs quota in two states.

తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్

Posted: 02/18/2019 08:18 PM IST
Ec releases schedule for mlc 2019 elections in telangana and andhra pradesh

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న 10 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యింది. ఈ నెల 21న ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఈ నెల 28 నామినేషన్లకు ఆఖరుకాగా.. మార్చి 1న నామినేషన్లు పరిశీలన.. మార్చి 5న ఉపసంహరణ ఉంటుంది. మార్చి 12న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు.

అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఫలితాలు వెల్లడిస్తారు. తెలంగాణలో ఐదు, ఏపీలో ఐదు స్థానాలకు ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ.. శమంతకమణి, ఆదిరెడ్డి అప్పారావు, శివకుమారిల పదవీకాలం పూర్తయ్యింది. దీంతో ఈ ఐదు స్థానాలకు ఎన్నిక జరగనుంది. తెలంగాణ విషయానికొస్తే.. మహమూద్ అలీ, మహ్మద్ సలీం, సంతోష్ కుమార్, షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డిల పదవీ కాలం ముగిసింది.

ఈ ఐదు స్థానాలకు మార్చి 12న పోలింగ్ జరగనుంది. అటు ఆంధ్రప్రదేశ్ లోని ఐదు స్థానాల్లో.. ఎమ్మెల్యే సంఖ్యాబలాన్ని బట్టి టీడీపీకి నాలుగు, వైసీపీకి ఒక్క పదవి వరిస్తుంది. వైసీపీకి దక్కే ఎమ్మెల్సీని ఆ పార్టీ బీసీ నేత జంగా కృష్ణమూర్తిని వరించింది. టీడీపీ నాలుగు సీట్లను ఎవరికి కేటాయించాలనే అంశంపై కసరత్తు చేస్తోంది. ఇటు తెలంగాణ విషయానికొస్తే.. టీఆర్ఎస్‌కు నాలుగు.. కాంగ్రెస్‌కు ఒక స్థానం దక్కే అవకాశముంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CM KCR  CM Chandrababu  TDP  TRS  Congress  YSRCP  Telangana  Andhra Pradesh  Politics  

Other Articles