SP-BJP face-off continues in Uttar Pradesh ఉత్తర్ ప్రదేశ్ ఉద్రిక్తం.. రాష్ట్రపతి పాలనకు డిమాండ్..

Sp bjp face off continues in uttar pradesh

BJP, Akhilesh Yadav, Samajwadi Party, Allahabad University, UP CM Yogi Adityanath, Prayagraj, Uttar pradesh

The face-off between the Samajwadi Party and the ruling Bharatiya Janata Party over the grounding of former Uttar Pradesh CM Akhilesh Yadav's flight to Prayagraj intensified with SP workers taking to streets and protesting in different parts of the state.

ITEMVIDEOS: ఉత్తర్ ప్రదేశ్ ఉద్రిక్తం.. రాష్ట్రపతి పాలనకు డిమాండ్..

Posted: 02/13/2019 05:24 PM IST
Sp bjp face off continues in uttar pradesh

సార్వత్రిక ఎన్నికల వేళ.. అత్యధిక స్థానాలున్న ఉత్తరప్రదేశ్ లో తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్న సమాజ్ వాదీ పార్టీని అధికార బీజేపి పార్టీ అడ్డుకుంటోంది. ఎంతలా అంటే ఏకంగా ఆ పార్టీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ను కూడా రాష్ట్రంలో తిరగనీయకుండా ఆంక్షలు విధిచేలా.? దీంతో అసలు  తామున్నది ప్రజాస్వామ్య దేశంలోనేనా.. అంటూ సమాజ్ వాదీ నేతలు ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఇక యోగి సర్కారు తమ అధినేతను అడ్డుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి.

ఎస్పీ కార్యకర్తల నిరసనలతో రాష్ట్రం దద్దరిల్లింది. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు లాఠీచార్జీకి దిగారు. ఎస్పీ కార్యకర్తలపై లాఠీలు ఝుళిపించారు. అలహాబాద్ యూనివర్సిటీలో విద్యార్థి నేత ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు బయలుదేరిన అఖిలేశ్ యాదవ్ లక్నో విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నారు. అలహాబాద్ యూనివర్సిటీకి వెళ్లేందుకు వీల్లేదని ఆయన చెప్పారు. తాను చాలా కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందని చెప్పినా అధికారులు వినిపించుకోలేదు.

విద్యార్థి నాయకుడి ప్రమాణస్వీకారోత్సవానికి వస్తున్న తమ నేతను పోలీసులు, ప్రభుత్వం అడ్డుకుందని తెలియడంతో సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు మండిపడ్డారు. ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు లేకపోయినా.. అఖిలేష్ యాదవ్ ను అడ్డుకుని ప్రభుత్వమే కావాలని శాంతిభద్రతలకు విఘాతం కల్పించేలా విద్యార్థులను రెచ్చగోడుతుందని ఎస్పీ నేతలు విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

అఖిలేశ్‌ను అడ్డుకోవడంపై అసెంబ్లీ, శాసన మండలి కూడా దద్దరిల్లాయి. ఎస్పీ సభ్యులు రాజ్‌భవన్‌కు చేరుకుని ధర్నాకు దిగారు. మరోవైపు యోగి ప్రభుత్వం తనను అడ్డుకోవడంపై అఖిలేశ్ స్పందించారు. విద్యార్థి నేత ప్రమాణ స్వీకారం కూడా యోగి సర్కారుకు నిద్రలేకుండా చేస్తోందని దుయ్యబట్టారు. విమానాశ్రయంలోనే తనను అడ్డుకున్నారంటే అందులో కేంద్రం పాత్ర కూడా ఉండే ఉంటుందని ఆరోపించారు. అఖిలేశ్ ను అడ్డుకోవడంపై నిరసన తెలుపుతూ రోడ్డెక్కిన ఎస్పీ కార్యకర్తలపై లాఠీ విరిగింది.

అయినా సమాజ్ వాదీ కార్యకర్తలు పట్టువదలకుండా రాజధాని రోడ్లపైకి వచ్చి.. యోగీ సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాజీ ముఖ్యమంత్రికి రాష్ట్రంలో తిరిగే అధికారం లేకుండా చేసి.. బీజేపి ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని వారో విమర్శించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమయ్యేలా యోగా సర్కార్ కుతంత్రాలు పన్నుతుందని అరోపించారు. యోగీ సర్కార్ కు ఉత్తర్ ప్రదేశ్ ను పాలించే హక్కు లేదని నినదించారు.

రాష్ట్రంలో తక్షణం రాష్ట్రపతి పాలన విధించాలని నిరసనకారులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. అయితే నిరసనకారులపై ఎక్కడికక్కడ పోలీసులు లాఠీచార్జీకి దిగి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. యూపీ ముఖ్యమంత్రి యోగీ ప్రాతినిధ్యం వహించే గోరఖ్ పూర్ లో ఉద్రిక్తలు మరింత ఎగసిపడ్డాయి. నిరసనకారులు వాహనాల అద్దాలను పగులగొట్టడంతో పరిస్థితి అదుపుతప్పింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles