CAG report on Rafale tabled in Rajya Sabha కాంగ్రెస్ భావించినట్లే కాగ్ నివేదిక వుందా.? అరోపణల్లో నిజమెంతా.?

Nda s rafale deal 2 86 pc cheaper than upa s 2007 offer cag

BJP, CAG, cag rafale report, CAG report, CAG Report on rafale, congress, Dassault, Dassault Aviation, Rafale, Rafale deal, Rafale probe, Narendra Modi, Rahul Gandhi, Anil Ambani, Congress, rajeevi maharshi, UPA, NDA, politics

The 2016 Rafale deal negotiated by the Narendra Modi government was 2.86% cheaper than the one chalked out in 2007, the much-awaited CAG report on the controversial defence acquisition has revealed.

కాంగ్రెస్ భావించినట్లే కాగ్ నివేదిక వుందా.? అరోపణల్లో నిజమెంతా.?

Posted: 02/13/2019 04:29 PM IST
Nda s rafale deal 2 86 pc cheaper than upa s 2007 offer cag

యావత్ దేశంలో చర్చనీయాంశంగా మారిన రాఫెల్ యుద్ధ విమానాల డీల్ పై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక రాజ్యసభ ముందుకు వచ్చింది. ఈ నివేదికలో సంచలన విషయాలను కాగ్ వెల్లడించింది. అయితే ప్రతిపక్ష పార్టీలు అరోపిస్తున్నట్టుగా ఈ నివేదికలో ఎలాంటి అవకతవకలు జరగలేదని.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అరోపిస్తున్నట్లు అంశాలేమీ లేవని స్పష్టం అయ్యింది. ఇక దీంతో అయినా రాఫెల్ పై కాంగ్రెస్ అరోపణలు అంశంపై అధికార ప్రతిపక్షాల మధ్య యుద్దం ముగుస్తుందా.? లేదా.? అన్న సందిగ్ధత మాత్రం నెలకొంది.

ఫ్రాన్స్ కంపెనీ డస్సాల్ట్ నుంచీ యూపీఏ హయాంలో నిర్ణయించిన 126 రాఫెల్ యుద్ధ విమానాలు కాకుండా కేంద్రం కేవలం 36 రాఫెల్ యుద్ధ విమానాల్ని మాత్రమే కొనాలనుకుంటున్న ఒప్పందంపై వివాదం కొనసాగుతోంది. ఈ డీల్ ద్వారా మోదీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే యూపీఏ ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న డీల్ కంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందమే బెస్ట్ అంటూ కాగ్ నివేదిక స్పష్టం చేసింది.

141 పేజీల కాగ్ రిపోర్టులో 32 పేజీల్లో రాఫెల్ డీల్ వివరాలున్నాయి. 2012 నుంచీ 2017 వరకూ రాఫెల్ ఒప్పందానికి సంబంధించి ఏం జరిగిందో కాగ్ రిపోర్టులో వివరాలున్నాయి. వైమానిక దళం చేస్తున్న 11 కొనుగోళ్ల ఒప్పందాల వివరాలు ఈ రిపోర్టులో ఉన్నాయి. వాటిలో 5 యూపీఏ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు కాగా... ఆరు ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వంలో తీసుకున్నవి. 126 యుద్ద విమానాల కోసం గతంలో యూపీఏ చేసుకున్న ఒప్పందం కంటే... ప్రస్తుత ప్రభుత్వం 36 విమానాల కోసం చేసుకున్న ఈ ఒప్పందం 2.8 శాతం తక్కువగా వుందని నివేదికలో కాగ్ పేర్కొంది.

అయితే, వివాదానికి కేంద్ర బిందువైన యుద్ధ విమానాల ధరను మాత్రం నివేదికలో కాగ్ పేర్కొనలేదు. ధరలను బహిరంగపరచకూడదని రక్షణ శాఖ భావిస్తుండటమే దీనికి కారణం. రాఫెల్ యుద్ధ విమానాలలో 13 కీలకమైన మార్పులను భారత్ కోరిందని... ప్రస్తుత దేశ రక్షణ పారామితులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారని... యుద్ధ విమానాల ఆధునికీకరణకు అయిన ఖర్చు కొత్త ఒప్పందంతో చాలా తగ్గిందని కాగ్ తెలిపింది. గత ఒప్పందం కంటే 5 నెలల ముందే 18 విమానాలు భారత్ కు రానున్నాయని చెప్పింది.

మరోవైపు, కాగ్ రిపోర్టు మొత్తంగా తాము ముందుగానే ఊహించినట్లుగానే వుందని కాంగ్రెస్ విమర్శించింది. కాగ్ రిపోర్ట్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉందని కాంగ్రెస్ సహా విపక్షాలు మండిపడ్డాయి. ప్రస్తుత కాగ్ రాజీవ్ మెహర్షీ అప్పట్లో ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్నారని... రాఫెల్ ఒప్పందంలో ఆయన అప్పట్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారని... దీంతో ఇక కాగ్ నివేదికలో తన నిర్ణయాలను తాను తప్పుని ఎలా అంగీకరిస్తారని కూడా ప్రశ్నించింది. అసలు ఆయన కాగ్ నివేదికను వెలువరించేందుకు వీల్లేదని నిరసన వ్యక్తం చేశాయి. కాగ్ నివేదిక నేపథ్యంలో, రాజ్యసభలో గందరగోళ పరిస్థితి నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  CAG  rafale report  Congress  rajeevi maharshi  UPA  NDA  politics  

Other Articles