Five held for attack on TV actor's car జబర్థస్త్ నటుడిపై దాడి కేసులో ఐదుగురి అరెస్టు

Five held for attack on jabardasth actor naresh s car

Visakhapatnam, Srikakulam, AP, Kalingandhra Utsav, lewd remarks, Bouncers, green room, Andhra Pradesh, Allari Naresh, Jabardast Naresh, potti ramesh @ naresh, Crime

Police arrested five persons for pelting stones at Jabardasth TV show actor Naresh’s car and attacking the driver in the wee hours on Sunday in Srikakulam.

జబర్థస్త్ నటుడిపై దాడి కేసులో ఐదుగురి అరెస్టు

Posted: 02/11/2019 06:23 PM IST
Five held for attack on jabardasth actor naresh s car

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ప్రతీవారం మూడు గంటల పాటు నవ్వుల్లో ముంచి వారు హాయిగా నవ్వుకునేలా చేసే కార్యక్రమం జబర్ధస్త్. ఈ షో లోకి ఎంట్రీ ఇచ్చిన పలువురు అర్టిస్టులు అటు వెండితెరపై కూడా వెలిగిపోతున్నారు. ఇదే సమయంలో ఈ ఆర్టిస్టులపై దాడులు కూడా వారిని కొంత ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వేణు, సుధీర్, అది ఇలా జబర్ధస్త్ నటులుపై దాడులు, గొడవలు జరిగిన విషయం తెలిసిదే.

తాజాగా జబర్దస్త్ బుడ్డోడిగా చాలా ఫేమస్ అవుతూ… పొట్టోడు గట్టోడు అనిపించుకున్న నటుడు నరేష్. నరేష్ ఈవెంట్స్ లో డాన్స్ పెర్ఫార్మెన్స్ లు, కామెడీ స్కిట్ లు చేస్తుంటాడు. ఈ క్రమంలోనే శ్రీకాకుళం లో ఒక ఈవెంట్ చేయటానికి వెళ్ళిన నరేష్ డాన్స్ టీం.. అంతా ముగించుకుని హైదరాబాద్ కు పయనం అవుతున్న క్రమంలో ఆయన బృందంపై దాడి చేసిన ఐదుగురు యువకులను విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

శ్రీకాకుళం కళింగాంధ్ర ఉత్సవాలలో నరేష్ ప్రోగ్రాం జరుగుతుండగా…కొంత మంది చిన్నరాబటం యువకులు గ్రీన్ రూం లోకి తొంగి చూస్తుండగా వాళ్ళను అక్కడి బౌన్సర్ లు అడ్డుకోవటం తో గొడవ మొదలయింది. దీంతో ఆగ్రహించిన యువకులు…ప్రోగ్రాం ముగించుకొని వస్తుండగా…నరేష్ టీం పై దాడికి పాల్పడ్డారు.ఈ విషయం జిల్లా కలెక్టర్ కి తెలియటం తో దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని ఆదేశించారు. దీంతో ఐదుగురు స్థానిక యువకులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Srikakulam  Andhra Pradesh  Jabardast Naresh  potti ramesh @ naresh  Crime  

Other Articles