Yashwant Sinha demands probe into alleged scam in DHFL DHFL కుంభకోణంపై విచారణకు యశ్వంత్ సిన్హా డిమాండ్

Probe alleged 31000 crore fund diversion by dhfl yashwant sinha

Dewan Housing Finance Corporation Ltd, DHFL, Cobrapost, Yashwant Sinha, dhfl scam, dhfl promoters, biggest financial scam

Former finance minister Yashwant Sinha demanded a probe into alleged diversion of Rs 31,000 crore of loans by DHFL that the company raised from banks a charge the NBFC termed as mischievous with a mala fide intention.

DHFL కుంభకోణంపై విచారణకు యశ్వంత్ సిన్హా డిమాండ్

Posted: 01/30/2019 12:19 PM IST
Probe alleged 31000 crore fund diversion by dhfl yashwant sinha

పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో దేశంలోని బ్యాంకులు పోటీ పడి మరీ తమ కస్టమర్లకు గృహరుణాలను మంజూరు చేశాయి. ఏడాదికి 7.3 వడ్డీరేటుతో ప్రారంభమయ్యే రుణాలు ఆ తరువాత రెండేళ్లలో మొత్తంగా రూపురేఖలు మారిపోయాయి. రెండేళ్ల పాటు రండి బాబు రండీ అంటూ పిలిచి మరీ రుణాలను అంటగట్టిన బ్యాంకులు.. ఇప్పుడు మాత్రం అగండీ బాబు అంటూ క్యూలో నిలబెడుతున్నాయి. అంతేకాదు 7.3 వడ్డీ కాస్తా 9కి చేరింది.

ఇక మరికోన్ని ప్రైవేటు సంస్థల రుణాల వడ్డీ రేటు 12కు కూడా చేరింది. అదే తనఖా పెట్టిన క్రమంలో ఆ వడ్డీ ఏకంగా 12 నుంచి 16 వరకు వుంది. ఇలాంటి ప్రవేటు గృహరుణాల సంస్థ దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (డీహెచ్‌ఎఫ్‌ఎల్‌) కూడా ఆ మధ్యకాలంలో పోటీ పడి మరీ ప్రచారాన్ని నిర్వహించింది. టీవీలలో ప్రకటన మొదలు రండి రుణాలు తీసుకోండి అంటూ ప్రచారం చేసింది. అయితే తాజాగా కోబ్రాపోస్టు ఈ ప్రైవేటు కంపెనీ ఆర్థిక కుంభకోణానికి పాల్పడిందని ఆరోపణలతో కూడిన ఓ కథనాన్ని తమ పత్రికలో ప్రముఖంగా ప్రచురించింది.

దీంతో ఈ కంపెనీపై తక్షణం విచారణ జరిపించాలని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్‌ సిన్హా డిమాండ్‌ చేశారు. డీహెచ్ఎఫ్ఎల్ స్కామ్ పై విచారణ జరపకపోతే ప్రభుత్వ చిత్తశుద్ధిని అనుమానించాల్సి ఉంటుందన్నారు. అవినీతి రహిత భారతావనిని నిర్మించడమే తమ లక్ష్యమని గోప్పలు చెప్పుకునే ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన నిజాయితీని, చిత్తశుధ్దిని నిరూపించుకునేందుకు ఇదే చక్కటి అవకాశమని ఆయన చెప్పుకోచ్చారు. కాగా ప్రధాని ఇప్పటికే నోట్ల రద్దు సహా రాఫెల్ డీల్ ఒప్పందాల నేపథ్యంలో అవినీతి అరోపణలు ఎదుర్కొంటున్నారని, ఇక అమిత్ షా కూడా తన కొడుకు జై షా కంపెనీ విషయంలోనూ అవినీతి అభియోగాలు ఎదుర్కోన్నారని అయన గుర్తుచేశారు.

ఈ పరిణామాల నేపథ్యంలో వాటిని తోసిరాజేందుకు.. తమ నిజాయితిని నిరూపించుకునేందుకు కేంద్రప్రభుత్వం న్యాయస్థానం పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందంతో దర్యాప్తు చేయించాలని పేర్కొన్నారు. లేని పక్షంలో, వేల సంఖ్యలో డొల్ల (షెల్) కంపెనీలను రద్దు చేశామని కేంద్ర ప్రభుత్వం చెప్పుకుంటున్నదంతా బోగాస్ వ్యవహారంగానే భావించాల్సి వుంటోందని సిన్హా అన్నారు. నిజానికి డొల్ల కంపెనీలను రద్దు చేస్తే.. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కంపెనీ కుంభకోణానికి ఎలా పాల్పడిందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. నియంత్రణ సంస్థలు సహా ప్రభుత్వ విభాగాలన్నీ ఈ కుంభకోణాన్ని అడ్డుకోవడంలో విఫలమయ్యాయని దుయ్యబట్టారు.

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ రూ.31,000 కోట్ల కుంభకోణానికి పాల్పడిందని కోబ్రాపోస్ట్‌ ఆరోపిస్తూ ఓ కథనాన్ని తమ పత్రికలో ప్రముఖంగా ప్రచురించింది. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కంపెనీ బ్యాంకుల ద్వారా రూ.97,000 కోట్ల రుణాలు సమీకరించిందని, డొల్ల కంపెనీల నెట్‌వర్క్‌ ద్వారా డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమోటర్లు రూ.31,000 కోట్లు దారి మళ్లించారని వివరించింది. భారత్‌లో ఇదే అతి పెద్ద ఆర్థిక కుంభకోణమని పేర్కొంది. కాగా ఈ ఆరోపణలను డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ఖండించింది. నియమ నిబంధనలకు అనుగుణంగానే రుణాలు ఇచ్చామని, ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : yashwant sinha  dhfl scam  dhfl promoters  DHFL  Cobrapost  biggest financial scam  

Other Articles