US Intel Warns of Terror Attacks in India by Pakistan-based Groups సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మతఘర్షణలకు అవకాశం: అగ్రరాజ్యం

India may witness communal violence before general elections warns us intel director

India, communal riots, communal violence, congress, Dan Coats, Lok Sabha elections 2019, BJP, 2019 Lok Sabha elections, Narendra Modi, Politics

There is a strong possibility of communal violence in India if the ruling BJP stresses on Hindu nationalist themes ahead of the general election in May, America's top spymaster told US lawmakers

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మతఘర్షణలకు అవకాశం: అగ్రరాజ్యం

Posted: 01/30/2019 11:29 AM IST
India may witness communal violence before general elections warns us intel director

సార్వత్రిక ఎన్నికల కోసం భారతీయులతో పాటు రాజకీయ పార్టీలు ఎదురుచూస్తున్న నేపథ్యంలో అమెరికాకు చెందిన నేషనల్ ఇంటెలిజెన్స్ పిడుగులాంటి వార్తను వినిపించింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భారత్ లో మత ఘర్షణలు చెలరేగే అవకాశాలు అధికాంగా వున్నాయని, వాటిని ఉగ్రవాద శక్తులు వాడుకునే అవకాశం కూడా వుందని.. దేశప్రజలు అప్రమత్తంగా వుండాల్సిన అవసరం వుందని స్పష్టం చేసింది.

అమెరికా ఇంటెలిజెన్స్ కమిటీ చీఫ్, సెనెటర్ డేనియల్ కోట్స్ ఇందుకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించారు. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ హిందుత్వ నినాదాన్ని తలకెత్తుకుంటే భారత్ లో మత ఘర్షణలు చెలరేగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన సెనెట్ సెలక్ట్ కమిటీకి నివేదికను సమర్పించారు. అందులో ప్రపంచవ్యాప్తంగా 2019లో హింస చెలరేగే అవకాశమున్న పరిస్థితులను ప్రస్తావించారు.

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలోని బీజేపీ మే నెలలో జరిగనున్న ఎన్నికల్లో.. హిందుత్వ అజెండాను ప్రధానాంశంగా చేసుకుంటే భారత్ లో మత ఘర్షణలు తప్పవని కమిటీ వ్యాఖ్యానించింది. ఇప్పటికే బీజేపి నేతలు, ఆర్ఎస్ఎస్ సహా కేంద్రమంత్రులు కూడా హిందువులకు మద్దతుగా పలు వివాదాస్పద వ్యఖ్యలు చేశారు. మోదీ ప్రభుత్వం తొలి ఐదేళ్లలో తీసుకున్న నిర్ణయాలతో పలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మతతత్వం తీవ్రంగా వేళ్లూనుకుందని తెలిపింది.

తమ కార్యకర్తలను, మద్దతుదారులను సంతృప్తి పరిచేందుకు హిందుత్వ నేతలు తక్కువస్థాయి హింసకు పాల్పడే అవకాశముందని కమిటీ నివేదికలో పేర్కొంది. దీనివల్ల భారతీయ ముస్లింలు ఏకాకి అవుతారనీ, దీన్ని ఉగ్రసంస్థలు వాడుకునే అవకాశముందని హెచ్చరించింది. అలాగే భారత్-పాక్ మధ్య సంబంధాలు మే నెలలో ఎన్నికలు జరిగేవరకూ మెరుగయ్యే అవకాశాలు లేవని తేల్చిచెప్పింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  communal riots  congress  Dan Coats  Lok Sabha elections 2019  Narendra Modi  Politics  

Other Articles