Pawan Kalyan power punch on YS Jagan జగన్ పై పవర్ పంచ్ పేల్చిన జనసేనాని పవన్

Pawan kalyan powerful political punch on ys jagan

pawan kalyan, janasena, Pawan Kalyan YS Jagan, Pawan punch to ys jagan, pawan kalyan porata yatra, pawan kalyan meet with dwacra sangh women, pawan kalyan east godavari yatra, Pawan Kalyan kostandhra yatra, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan gives powerful political punch on YS Jagan, says he is irresponsible opposition leader who doesn't fights on problems faced by the people.

జగన్ పై పవర్ పంచ్ పేల్చిన జనసేనాని పవన్

Posted: 11/29/2018 07:59 PM IST
Pawan kalyan powerful political punch on ys jagan

తనను కలిసిన మహిళలు, యువతుల కురులు సర్దడం, వారితో సెల్ఫీలు దిగడం, బుగ్గలు నిమరడం మినహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు మరేమీ చేయడం చేతకాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆడపడచుల భద్రత, వారు ఎదుర్కోనే సమస్యలను పరిష్కారించడంతో పాటు వారిని రాజకీయాల్లో ఎదిగేందుకు గత ఐదేళ్లుగా ఆయన ఏం చేశాడని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై శాసనసభలో ప్రశ్నించి.. ప్రజాకంఠక ప్రభుత్వ నిర్ణయాలపై ఎప్పటికప్పుడు పోరాడాల్సిన జగన్.. ప్రతిపక్ష నాయకుడి హోదాలో గత ఐదేళ్లుగా సాధించిందేమిటని పవన్ నిలదీశారు.

అసెంబ్లీకి వెళ్లకుండా, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని జగన్ తో రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగబోదని అన్నారు. అవినీతిని ప్రశ్నించడంలో జగన్ పూర్తిగా దద్దమ్మలా మారిపోయారన్నారు. తన ఎమ్మెల్యేలతో కలసి అసెంబ్లీ నుంచి పలాయనం చిత్తగించారని ఆయన విమర్శించారు. అయన బాటలోనే నడుస్తున్న ఆయన ఎంపీలు కూడా తమ పదవీ కాలం ఉన్నంత వరకు ప్రత్యేక హోదా కోసం పోరాడకుండా పార్లమెంటు నుంచి బయటకు వచ్చేశారని ఎద్దేవా చేశారు. జగన్ వైఖరి వల్లే చంద్రబాబు, లోకేశ్ దోపిడీ రాజ్యానికి అడ్డు లేకుండా పోయిందని పవన్ ఆరోపించారు.

రాజోలు నియోజకవర్గ పరిధిలోని మలికిపురంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. కోనసీమలో గ్యాస్ ను దోచుకుని వెళుతున్నా చంద్రబాబు మిన్నకున్నారని ఆరోపించారు. చంద్రబాబు వంటి వ్యక్తుల నుంచి దక్షిణ భారత నినాదం వస్తుందనుకున్నానని, కానీ, ఆయన నాలుగేళ్ల పాటు మోదీ కొంగుపట్టుకుని తిరిగారని ఆరోపించారు. బీజేపీ హిందీ పార్టీ అయినప్పటికీ, తెలుగు భాషను చంపుకునే విషయంలో తాను రాజీ పడబోనని, హిందీని రుద్దుతామంటే అంగీకరించనని చెప్పారు.

కోనసీమ మహిళమణులు చూపిన ఆదరణ మరువలేనిదన్న పవన్ కోనసీమలో మూడు అడుగుల లోతులో గ్యాస్ లైన్లు వేసి ప్రాణాలను బలితీసుకుంటున్నా సీఎం, జగన్ లకు నోరు మెదపడం లేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జనసేన గాలి విస్తుందన్న పవన్.. రానున్న ఎన్నికలలో తాము తప్పక అధికారంలోకి వస్తామని అన్నారు. తనకు సగటు మధ్యతరగతి ప్రజల కష్టాలతో పాటు పేదలు, బడుగుల కనీళ్లు వెనుక దిగులు కూడా అర్థమవుతుందని అన్నారు.

తనకు విప్లవ నాయకుడు చేగువిరా అంటే ఇష్టం.. క్యూబా విప్లవకారుడు నుండి ఎన్నో పాఠాలు నేర్చకోవచ్చన్నారు. పీడిత ప్రజలకు అండగా ఉంటాం.. కులమతాలకు జనసేన అతీతం అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఛీత్కారాలు ఎదుర్కొన్నాం.. అవమానాలు పడ్డాం.. పాలకులు తప్పిదాలు ఆంధ్రులకు శాపంగా మారాయన్నారు. అధికారులు సైతం వివక్షకు గురయ్యారు..ప్రశ్నించే దమ్ము చంద్రబాబు, జగన్ కు లేదని..దద్దమ్మల్లా వ్యవహరిస్తున్నారన్నారు.

పవన్ అమెరికా పర్యటన ఖరారు

ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయంగా తన సత్తాచాటుతూ ముందుకు దూసుకెళ్తున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మూడు రోజులపాటు అమెరికాలో పర్యటించి అక్కడి ఎన్‌ఆర్‌ఐలతో భేటీ కావాలని నిర్ణయించారు. ఇప్పటికే  రాష్ట్రంలో వరుస భేటీలు, యాత్రలు, పోరాటాలతో బిజీగా ఉన్న జనసేనాని అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నారు. గతంలోనూ ఒకసారి అమెరికాలో పర్యటించి అక్కడి ఎన్‌ఆర్‌ఐలతో భేటీ అయిన పవన్ కల్యాణ్‌ డిసెంబరు 14న మరోసారి వారితో భేటీకావాలని నిర్ణయించారు. ఇందుకోసం డల్లాస్‌ వేదికగా ప్రత్యేక కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles