conspiracy to kill me alleges revanth reddy నన్ను చంపేందుకు ప్రభుత్వం కుట్ర: రేవంత్ రెడ్డి

Conspiracy to postpone kodangal election alleges revanth reddy

CM KCR, congress, tamil nadu, RK Puram, By election, narendra modi, revanth reddy, Patnam Mahinder reddy, Telangana, Telangana Election 2018, Trs, Telangana politics

telangana congress comittee working president revanth reddy alleges that TRS government and union government are planning conspiracy to postpone the kodangal assembly elections and to kill him.

కొడంగల్ ఎన్నికలను వాయిదా వేసేందుకు కుట్ర: రేవంత్ రెడ్డి

Posted: 11/29/2018 07:18 PM IST
Conspiracy to postpone kodangal election alleges revanth reddy

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలిచే స్థానాల్లో ఎన్నికలను నిలిపివేయాలని కుట్రలకు తెరతీస్తుందని కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మరీ ముఖ్యంగా కొడంగల్ ఎన్నిక వాయిదా వేసేందుకు చూస్తున్నారని హైదరాబాదులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం తనను చంపాలని చూస్తోందని ఆయన అరోపించారు. తెలంగాణను కేసీఆర్ ఖూనీ చేశారని మండిపడ్డారు.

కొడంగల్ లో టీఆర్ఎస్ నేత ఇంట్లో రూ. 17.51 కోట్లు దొరికాయని ఆరోపించిన రేవంత్ రెడ్డి... ఈ విషయం బయటకు రాకుండా ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల అధికారులు, ఐటీపై ఒత్తిడి తీసుకొచ్చారని మండిపడ్డారు. కొన్ని నెలల నుంచి కొడంగల్‌లోని ఇతర పార్టీల నాయకులను కొనుగోలు చేసేందుకు టీఆర్ఎస్ రూ. 50 కోట్లు ఖర్చు చేసిందని... ఇందుకు సంబంధించిన డైరీ కూడా ఐటీ అధికారులకు దొరికిందని రేవంత్ రెడ్డి అన్నారు. అయితే కేవలం రూ. 51 లక్షలు మాత్రమే దొరికాయని ఎన్నికల అధికారులు లీకులు ఇచ్చారని ఆరోపించారు.

ఇందుకు సంబంధించిన రహస్య నివేదికను తొక్కిపెట్టారని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అన్ని రకాలుగా ఉల్లంఘించారని రేవంత్ రెడ్డి విమర్శించారు. తమిళనాడులో డబ్బుల పంపిణీ జరిగిందని ఎన్నికల సంఘంతో నివేదిక తెప్పించుకుని గత ఏడాది ఆర్కే నగర్ ఎన్నికను వాయిదా వేశారని... తెలంగాణలోనూ అదే రకంగా కొడంగల్ ఎన్నికలను వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా... తన విజయాన్ని ఆపలేరని రేవంత్ రెడ్డి అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CM KCR  congress  narendra modi  revanth reddy  Telangana  Telangana Election 2018  Trs  Telangana politics  

Other Articles