Chidambaram will go to jail: Swamy సార్వత్రిక ఎన్నికలకు ముందే చిదంబరం జైలుకు: స్వామీ

Bjp self goal subramanian swamy says fm jaitley knows nothing about economics

Arun Jaitley, Subramanian Swamy, chidambaram, PM modi, Amit Shah, demonitisation, black money, raghuram rajan, RBI Governor, Economics, income tax, sonia gandhi, abdul kalam, politics

Union Finance Minister Arun Jaitley doesn’t know economics, Rajya Sabha MP Subramanian Swamy claimed while laying the blame of various policy failures on Jaitley which has, according to him, led the ‘Indian economy into a tailspin’.

సొంతపార్టీలో బీజేపి ఎంపీ సుబ్రమ్మణ్య స్వామి సెల్ప్ గోల్

Posted: 10/29/2018 11:40 AM IST
Bjp self goal subramanian swamy says fm jaitley knows nothing about economics

నిత్యం సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నానే వ్యక్తి బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి.. ప్రధాని నరేంద్రమోడీకి ప్రైవేటు మౌత్ పీస్ అన్న విమర్శలు కూడా వచ్చినా.. ఆయన వాటిని పట్టించుకోకుండా అటు సొంతపార్టీ మంత్రులు, నేతలపై విమర్శలు చేయడంతో పాటు ఇటు ప్రతిపక్ష నేతలపై కూడా విమర్శలు గుప్పిస్తూనే వున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్  జైట్లీకి అసలు అర్థిక శాస్త్రం గురించి అసలు అవగాహనే లేదు అన్ని ఖారాఖండిగా చెప్పి బీజేపి పార్టీలో సెల్ప్ గోల్ చేసుకునేలా చేశారు.

నోట్ల రద్దు, నల్లధనం విషయంలో ఆయన తగు జాగ్రత్త చర్యలు తీసుకుని వుంటే.. అర్థిక పరిస్థితి చాలా బాగుండేదని నోట్ల రద్దు వ్యవహారం, నల్లధనం, జీఎస్టీ, ఆధార్ సహా పలు అంశాల్లో జరిగిపోయిన తప్పిదాలను అర్థికమంత్రిపై వేసేందుకు యత్నించారు. నోట్ల రద్దు వ్యవహారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తాను స్వయంగా లిఖితపూర్వకంగా ప్రధాని నరేంద్రమోడీకి అందిస్తే.. ఆయన దానిని అర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి అందజేశారని, అయితే నల్లధనంపై యాభైశాతం పన్ను విధించడంతో నల్లధనం కలిగిన వ్యక్తులు దానిని ప్రభుత్వానికి అందించేందుకు కూడా ముందుకు రాలేదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇక తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన మహిళా వాణిజ్యవేత్త(ఫిక్కీ)ల గ్రూప్ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న మాట్లాడుతూ కూడా సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళా వాణిజ్యవేత్త సమాఖ్యలోని (ఫిక్కీ) సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన ఆయన.. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం జైలుకు వెళ్తారని పేర్కొన్నారు.

ఇందిరాగాంధీ, సోనియాగాంధీ, జయలలిత వంటి మహిళా నేతలతో మీకు శత్రుత్వం ఎందుకన్న ప్రశ్నకు స్వామి బదులిస్తూ సమాధానాన్ని దాటవేత ధోరణిలో బదులిచ్చారు. వారితో ఎందుకు వైరం అన్న సమాధానాన్ని ఇవ్వని స్వామి.. మాయావతి, మమతా బెనర్జీ తనకు మంచి స్నేహితులని పేర్కొన్నారు. ఇక అంతటితో ఆగని స్వామి.. రాజీవ్ గాంధీ లాంటి వ్యక్తి సోనియాను పెళ్లాడి తప్పుచేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

నిజానికి రాజీవ్ చనిపోయే నాటికి ఆ దంపతుల మధ్య అంత సామరస్యపూరిత వాతావరణం లేదన్నారు. సోనియాగాంధీ ప్రధాని కాకుండా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 90 శాతం అడ్డుకున్నారని, తానో పది శాతం కృషి చేశానని అన్నారు. ఆ విషయం తెలిసే కలాం రెండోసారి రాష్ట్రపతి కాకుండా సోనియా అడ్డుకున్నారన్నారు. బీజేపి ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సమాధానాలపై సమావేశానంతంరం ఫిక్కీ సభ్యులు ఆయన చేసిన వ్యాఖ్యలపై గుసగులాడుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles