Tollywood lyric writer kulashekar arrest సినీగేయ రచయిత కులశేఖర్ అరెస్టు

Tollywood lyric writer kulashekar arrest

kulashekar, kulashekar arrest, lyric writer kulashekar, lyric writer kulashekar arrest, brahmin hater, cinematographer kulashekar, arrest, rajamundry police, simhachalam temple, mata temple, tollywood news, telangana police, hyderabad police, crime

Tollywood lyric writer kulashekar was arrested by hyderabad police. He became a brahmin hatred person and robbed a bag of a priest at rbi colony in hyderabad.

సినీగేయ రచయిత కులశేఖర్ అరెస్టు

Posted: 10/29/2018 12:29 PM IST
Tollywood lyric writer kulashekar arrest

సినీ గేయ రచయిత తిరుమల పల్లెర్లమూడి కులశేఖర్ (47)ను హైదరాబాద్, జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ఆలయ పూజారి చేతి సంచిని చోరీ చేసిన కేసులో అతడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. విశాఖపట్టణంలోని సింహాచలానికి చెందిన కులశేఖర్ హైదరాబాద్ మోతీనగర్ లో నివాసముంటూ సినీ గేయ రచయితగా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. దాదాపు వందకుపైగా పాటలు రాసిన కులశేఖర్ చెడు వ్యసనాలకు బానిసయ్యాడు.

దీంతో గత కొంతకాలంగా పరిశ్రమకు, కుటుంబ సభ్యులకు దూరమయ్యాడు. ఓ సినిమాలో కులశేఖర్ రాసిన పాట బ్రాహ్మణులను కించపరిచేలా ఉందంటూ ఆ సామాజిక వర్గం అతడిని దూరం పెట్టడమే ఆయనను సినీ పరిశ్రమకు దూరం చేసింది. దీంతో బ్రాహ్మణులపై కక్ష పెంచుకున్న ఆయన ఆలయాలు, పూజారులను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నాడు. 2016లో కాకినాడలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో శఠగోపాన్ని చోరీ చేశాడు. ఈ కేసులో రాజమండ్రి జైలులో ఆరు నెలల పాటు జైలు శిక్ష అనుభవించాడు.  

మూడు రోజుల క్రితం ఆర్బీఐ క్వార్టర్స్ సమీపంలో ఉన్న మాతా దేవాలయంలోని పూజారి చేతి సంచిని దొంగిలించి పారిపోయాడు. ఆదివారం శ్రీనగర్ కాలనీలో అనుమానాస్పదంగా తచ్చాడుతూ కనిపించిన కులశేఖర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. అతడి నుంచి రూ.50 వేల విలువైన 10 మొబైల్ ఫోన్లు, రూ.45 వేల విలువైన ఇతర వస్తువులు, క్రెడిట్, డెబిట్ కార్డులు, తాళం చెవులను స్వాధీనం చేసుకున్న పోలీసులు అతడిని రిమాండ్‌కు పంపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kulashekar  lyric writer  thief  robber  temples  brahmins  tollywood  crime  

Other Articles