Punjab minister harassing woman officer అమాత్యా.. సభ్యసమాజానికి మీరిచ్చే సందేశమిదేనా..?

Minister sent inappropriate messages to female ias officer

Punjab minister, Charanjit Singh Channi, women ias officer, metoo, metoo movement, inappropriate messages, sexual harrasment, punjab police, Amarinder Singh, Rahul Gandhi, congress, punjab

Punjab technical education minister Charanjit Singh Channi is in the crosshairs of an unsavoury controversy after a woman IAS officer accused him of sending “inappropriate” text messages to her.

మంత్రివర్యా.. ఇదేనా సభ్యసమాజానికి మీరిచ్చే సందేశం..

Posted: 10/25/2018 12:08 PM IST
Minister sent inappropriate messages to female ias officer

హుందాగా వ్యవహరించి.. రాష్ట్ర ప్రజల్లోని కొందరు యువతకైనా తాను అదర్శంగా నిలావాల్సిన ఓ అమాత్యులే.. ప్రభుత్వంలోని ఓ సీనియర్ ఐఏెఎస్ అధికారిని పట్ల అసభ్యంగా ప్రవర్తించి.. అమర్యాదగా నడుచుకోవడం ఇప్పడు చర్చనీయాంశమైంది. నాయకులు, అందులోనూ మంత్రులు సామాన్య ప్రజలకు అదర్శప్రాయంగా నిలవాల్సిందిపోయి.. అసభ్యకర చర్యలు, చేష్టలతో వార్తల్లో నిలవడంతో.. వారిని పదవుల నుంచి తప్పించాలన్న డిమాండ్ తెరపైకి వస్తుంది.

పంజాబ్ లో ఓ సీనియర్‌ మహిళా ఐఏఎస్ అధికారిణికి ఆ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ మంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీ అసభ్యకర మెసేజ్‌లు పంపించడం వివాదానికి కారణమైంది. బాధిత అధికారిని ఈ విషయాన్ని ప్రభుత్వంలోని తన సీనియర్ అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువచ్చారు. వారు మంత్రి చర్యలపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. దీంతో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సదరు మంత్రిని పిలిచి మందలించడమేకాక, అధికారిణికి క్షమాపణలు చెప్పించారు.

ఇజ్రాయిల్ పర్యటనలో వున్న ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్దికి చేపడుతున్న పలు కార్యక్రమాలను వివరించిన క్రమంలో మీడియా అడిగిన ఈ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. అయితే అటు మంత్రి పేరును కానీ, ఇటు బాధిత అధికారిని పేరును కానీ ఆయన వెల్లడించలేదు. అయితే బాధిత అధికారిణికి సంతృప్తి చేందే విధంగా తాను చర్యలు తీసుకుని క్షమాపణలు చెప్పించామని సీఎం అమరీందర్ సింగ్ తెలిపారు. అయితే ఈ విషయం అప్పటికే మీడియాకు లీక్‌ కావడంతో బహిర్గతమైంది.

కాగా మంత్రి ఎవరన్న విషయాన్ని ప్రభుత్వంలోని ఓ సీనియర్ అధికారి మీడియాకు వెలువరించినట్లు సమాచారం. కాగా యూకే పర్యటనలో వున్న మంత్రిని వివరణను తీసుకునేందుకు మీడియా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయితే ఆయనను పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్‌ మొదలయ్యింది. అప్ మహిళా విభాగం మంత్రి చన్నిని మంత్రివర్గం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తుంది. ఇక అధికారినికి బాసటగా పలు మహిళా సంఘాలు కూడా జతకలిసి ఉద్యమిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Punjab minister  Charanjit Singh Channi  women ias officer  metoo  punjab  

Other Articles