AP govt sends Good news to Teacher aspirants ఏపీ ఉపాధ్యాయ ఆశావహులకు గుడ్ న్యూస్..

Ap dsc 2018 trt tetcumtrt schedule released

Education News, results, recruitment, job, Exam, ap dsc schedule 2018, ap dsc notification, dsc, trt, tet, Admit card, Andhra pradesh goverment

The Andhra Pradesh HRD Minister Ganta Srinivasa Rao has announced the most awaited AP District Selection Committee (AP DSC) recruitment schedule to fill 7,676 vacant teacher posts across the state of Andhra Pradesh.

ఏపీ ఉపాధ్యాయ ఆశావహులకు గుడ్ న్యూస్.. 6776 పోస్టుల భర్తీ

Posted: 10/25/2018 12:39 PM IST
Ap dsc 2018 trt tetcumtrt schedule released

ఆంధ్రప్రదేశ్ లో డీఎస్సీ షెడ్యూల్ విడుదలైంది. మంత్రి గంటా శ్రీనివాసరావు షెడ్యూల్ ను స్వయంగా ప్రకటించారు. పలు సాంకేతిక కారణాల వల్ల నోటిఫికేషన్ ఆలస్యమైందని చెప్పిన ఆయన, నవంబర్ 1 నుంచి ఆన్ లైన్లో దరఖాస్తులు అందుబాటులోకి తేనున్నామని అన్నారు. దరఖాస్తులు 16వ తేదీ వరకూ పొందవచ్చన్నారు. స్కూల్ అసిస్టెంట్ (నాన్ లాంగ్వేజస్)కు డిసెంబర్ 6 నుంచి 10 వరకు, స్కూల్ అసిస్టెంట్ (లాంగ్వేజస్)కు డిసెంబర్ 11న పరీక్ష ఉంటుందని తెలిపారు. 12, 13 తేదీల్లో పీజీ టీచర్స్ రాతపరీక్ష ఉంటుందని అన్నారు.

టెట్ కట్ టీఆర్టీ ద్వారా 7,675 ఉద్యోగాలను, ప్రభుత్వ, జెడ్పీ పోస్టులు 4,341, మునిసిపల్ పోస్టులు 1,100, మోడల్ స్కూల్స్ లో 909 పోస్టులు, బీసీ వెల్ఫేర్ లో 300 పోస్టులు, ఎస్జీటీ 3,666 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ 1,625 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్స్ 452 పోస్టులు భర్తీ చేయనున్నామని గంటా వెల్లడించారు. నవంబర్ 19 నుంచి సెంటర్ ఆప్షన్లను ఎంపిక చేసుకోవచ్చని అన్నారు. నవంబర్ 17 నుంచి ఆన్ లైన్ మాక్ టెస్టులు నిర్వహిస్తామని, 20 తరువాత హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను రేపు విడుదల చేయనున్నామని ఆయన తెలిపారు.  

 ముఖ్యమైన తేదీలు

1 TRT & TET cum TRT నోటిఫికేషన్  : 26.10.2018

2. ఫీజు చెల్లింపు                             : 01 నుండి 15.11.2018

3. అప్లికేషన్ ఆన్ లైన్ సమర్పణ          : 01 నుండి 16.11.2018
 
4 హెల్ప్ డెస్క్ సేవలు                      : పని గంటలు 01 నుండి 12.01.2018 వరకు

5. కేంద్రాల ఎంపిక                          : 19 నుండి 24.11.2018 వరకు

6. ఆన్లైన్ మాక్ టెస్ట్                        : 17.11.2018 నుండి

7. హాల్ టికెట్స్ నుండి డౌన్లోడ్             : 29.11.2018

8 పరీక్ష వ్రాసిన పరీక్ష
(TRT-2018 మరియు TETcumTRT)    : భాషేతర స్కూల్ అసిస్టెంట్స్, 06 నుంచి 10.12.2018
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)
                                                 : భాషాయుత స్కూల్ అసిస్టెంట్స్ 11.12.2018

                                                 : పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 12 & 13.12.2018

                                                : టీచర్ గ్రాడ్యుయేట్, టీచర్ అండ్ ప్రిన్సిపల్స్ -14 & 26.12.2018

                                                : PET లు, సంగీతం, క్రాఫ్ట్ అర్ట్స్ అండ్ డ్రాయింగ్ 17.12.2018

                                                : భాష పండిట్స్ 27.12.2018

                                                : సెకండరీ గ్రేడ్ టీచర్స్- 28 నుంచి 02.01.2019

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap dsc schedule 2018  ap dsc notification  dsc  trt  tet  Admit card  Andhra pradesh goverment  

Other Articles