అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపికి షాక్.. BJP MLA Manvendra Singh joins Congress

Jaswant singh s son manvendra singh joins congress ahead of elections

BJP, Congress, Manvendra Singh, Jaswant Singh, Rahul Gandhi, assembly elections, Sheo constituency, assembly elections, vasundara raje, amit shah, PM Modi, ashok gehlot, Rajasthan, politics

Rajasthan MLA Manvendra Singh, son of veteran BJP leader Jaswant Singh, joined the Congress. Last month, Manvendra Singh resigned from the BJP, saying it had been a mistake to join the saffron party.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపికి షాక్..

Posted: 10/17/2018 07:13 PM IST
Jaswant singh s son manvendra singh joins congress ahead of elections

రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 7న జరుగనున్న నేపథ్యంలో అధికార బీజేపి నేతృత్వంలోని వసుంధర రాజే ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపి మాజా సినియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ తనయుడు మన్వేంద్ర సింగ్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజస్థాన్ లోని షియో నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మన్వేంద్ర సింగ్‌ ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో హస్తినలో కాంగ్రెస్‌లో చేరారు.

రాహుల్ గాంధీ మన్వేంద్ర సింగ్ కు పార్టీ కండువాను కప్పి.. సాదరంగా పార్టీలోకి అహ్వానించడాన్ని కాంగ్రెస్ నేతలు స్వాగతించారు. మన్వేంద్ర గత నెల 22న కాషాయ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపిలో చేరడం తాను చేసిన పెద్ద తప్పని పేర్కొన్నారు. అందుకే ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బీజేపి వ్యవస్థాపకుల్లో ఒకరైన జశ్వంత్‌ సింగ్‌ కుమారుడిగా తాను ఈ వ్యాఖ్యలు చేయాల్సివస్తుందని అవేదన వ్యక్తం చేశారు. అయితే.. మన్వేంద్ర సింగ్‌ బీజేపిని వీడటం వల్ల పార్టీకి నష్టమేమి ఉండదని, అది ఎన్నికలపై ఎటువంటి ప్రభావం చూపదని రాజస్థాన్‌ మంత్రి రాజేంద్ర రాథోర్‌ పేర్కొన్నారు.

అటల్‌ బిహారీ వాజ్‌పేయీ హయాంలో జశ్వంత్‌ సింగ్‌ రక్షణశాఖ, విదేశాంగశాఖ మంత్రిత్వ బాధ్యతలు నిర్వర్తించారు. బీజేపి తీరుపై అసహనంగా ఉన్న మన్వేంద్ర గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉన్నారు. రాజస్థాన్ లో వసుంధర రాజే కుటుంబంతో వున్న బంధం కూడా సన్నగిల్లింది. పార్టీ నిలిపిన అభ్యర్థిని కాదని గత ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన తన తండ్రికి ఆయన మద్దతు ప్రకటించారు. దీంతో అప్పటి నుంచి పార్టీ ఆయనను కొంత దూరంగా పెట్టింది. ఈ క్రమంలో ఆయన పార్టీకి రాజీనామా చేసి.. ఇవాళ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles