AP cops locked by villagers inside house దొంగల వెంటపడ్డారు.. గ్రామస్థులకు బంధీలయ్యారు..

Ap cops go to tn village to arrest criminal villagers lock them inside house

Ramakrishnan, godwomen, fortune teller, Sri Harsha, Dharmapuram urban police, Andhra Pradesh Police, Melakuppam, Rathinagiri police, Vellore district, Tamil Nadu, crime

Villagers at Melakuppam in Vellore district of Tamil Nadu attacked a police team from Andhra Pradesh who arrested a 32-year-old habitual offender. The villagers locked the police team inside a house.

దొంగల వెంటపడ్డారు.. గ్రామస్థులకు బంధీలయ్యారు..

Posted: 10/17/2018 06:27 PM IST
Ap cops go to tn village to arrest criminal villagers lock them inside house

దొంగలు, దోపిడీ ముఠాల నాయకులను పట్టుకునేందుకు పోలీసులు చేపట్టే ఆపరేషన్లు అంత సజావుగా సాగవు. చాలాసార్లు పోలీస్ అధికారుల నుంచి దొంగలు తప్పించుకుంటారు. ఈ క్రమంలో దొంగల ముఠా నుంచి పోలీసులకు అనేక సవాళ్లు కూడా ఎదురవుతుంటాయి. వారు దాడులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినా పోలీసుల వారిని చట్టానికి బంధీలుగా తీసుకురావడంలో మాత్రం ఎన్నో కష్టనష్టాలు వుంటాయి. ఓక్కోసారి దొంగలను పట్టుకోవడంలో పోలీసులు తమ ప్రాణాలపైకి కూడా తెలచ్చుకుంటారు.

అలాంటి కష్టమైన ఉద్యోగం పోలీసు అంటే. అయితే కొందరు చేసే పనులు యావత్ పోలీసులపై పడి సమాజంలో వారికి గౌరవం సన్నగిల్లుతంది. ఇలాంటి కత్తిమీద సాములాంటి ఉద్యోగంలో వున్నా పోలీసులకు పలు సందర్భాలలో అనుకోని వింత అనుభవాలు ఎదురవుతుంటాయి. ఇలాంటి అనుభవమే మన అంధ్రప్రదేశ్ పోలీసులకు ఎదురైంది. తాము పోలీసులమని చెప్పినా ఆ గ్రామస్థులు వారిని విశ్వసించకుండా వారని తాళ్లతో కట్టి ఓ గదిలో బంధించారు.

తాము పక్క రాష్టరం నుంచి వచ్చిన పోలీసులమని, గజదొంగను పట్టుకోవడానికి వచ్చామని చెప్పినా వినిపించుకోలేదు. దీంతో దొంగల వెంటపడి వారిని పట్టుకున్న పోలీసులు.. గ్రామస్థుల చేతిలో బందీలుగా మారారు. పోలీసులను కూడా దొంగలుగా అనుమానించి గదిలో బంధించారు. తీరా పోలీసులు వచ్చి వీరు అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పోలీసులని చెప్పడంతో వారిని గ్రమాస్థులు విడిచిపెట్టారు. అయితే ఇదే అదనుగా బావించిన గజదొంగ మాత్రం అక్కడి నుంచి జంఫ్ అయ్యాడు.

తమిళనాడులోని ఇలవన్‌తోపు ప్రాంతానికి చెందిన రామకృష్ణన్‌ (30)పై ఏపీలోని అనంతపురం జిల్లాలో 40కిపైగా దోపిడీ కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రామకృష్ణన్‌ ఇలవన్ తోపు ప్రాంతంలోనే తలదాచుకున్నట్లు తెుసుకున్న పోలీసులు ఎస్ ఐ సిరిహర్ష నేతృత్వంలోని ఐదుగురు పోలీసుల బృందం మఫ్టీలో సోమవారం రాత్రి అక్కడకు చేరుకున్నారు. రామకృష్ణన్ కోసం వేచి చూశారు. సుమారు రాత్రి పదిగంటల వ్యవధిలో ఇంటికి చేరుకున్న రామకృష్ణన్ ను తమ అదుపులోకి తీసుకున్నారు.

అయితే పోలీసులను దొంగలుగా అనుమానించిన గ్రామస్థులు వారిపైకి దాడికి దిగారు. వారి చేతలను కట్టేసి.. అందరినీ ఓ గదిలో బంధించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న వేలూరు జిల్లాలోని రత్నగిరి పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి వారిని విడిపించారు. అయితే ఈ గొడవ జరుగుతున్న క్రమంలో రామకృష్ణన్‌ అక్కడి నుంచి చల్లగా జారుకున్నాడు. దీంతో పోలీస్ అధికారులు తలలు పట్టుకున్నారు. అసలు ఇంతకీ గ్రామం మొత్తం ఏకం కావడానికి కారణం తెలుసుకున్నారు. గ్రామస్థులకు రామకృష్ణన్ గురించి వివరించారు.

రామకృష్ణన్ ఓ దొంగ. అతనిపై దాదాపు 40కి పైగా కేసులున్నాయి. దీంతో అతను దర్మాపురం అర్భన్ పోలీసు స్టేషన్లో అనేక కేసులు పెండింగ్ లో వున్నాయని చెప్పారు. అయితే ఇదంతా తాను కొన్నేళ్ల కిత్రం చేసిన దొంగతనాలని.. ఆ తరువాత ఆయన ఓ జ్యోతిష్యురాలని పెళ్లి చేసుకుని ఇక్కడ స్థిరపడ్డారని తెలుసుకన్నామని, అందుచేత అతన్ని అరెస్టు చేసేందుకు వచ్చామని పోలీసులు తెలిపారు. గ్రామస్థులు అనుమానిస్తున్నట్లుగా తమ మాత భర్తను అదుపులోకి తీసుకునేందుకు రాలేదని చెప్పారు. దీంతో గ్రామస్థుల సహకారంతో రామకృష్ణన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ramakrishnan  Andhra Pradesh Police  Melakuppam  Rathinagiri police  Tamil Nadu  crime  

Other Articles