Andhra ministers, businessmen raided by it officials మంత్రి రియల్ ఎస్టేట్ సంస్థపై ఐటీ శాఖ దాడులు..

Andhra ex legislator s firm among properties raided by tax officials

witch-hunt, N. Chandrababu Naidu, hyderabad, Guntur, Cashew, IT Raids, Businessmen, Political Leaders, Ministers, Andhra Pradesh

Income tax sleuths sprang a surprise on business and political circles in Andhra Pradesh by launching simultaneous searches in several companies in Vijayawada, Guntur, Visakhapatnam and Srikakulam.

మంత్రి సంస్థలపై ఐటీ శాఖ దాడులు.. కీలక డ్యాకుమెంట్లు స్వాధీనం..

Posted: 10/05/2018 12:51 PM IST
Andhra ex legislator s firm among properties raided by tax officials

హైదరాబాద్ లోని కొందరు కాంగ్రెస్ రాజకీయ నాయకులను టార్గెట్ గా చేసుకుని వారి ఇళ్లపై జరిగిన ఐటీ దాడులు, ఇప్పుడు నవ్యాంధ్రకూ విస్తరించాయి. నెల్లూరు టీడీపీ నేత బీద మస్తాన్ రావు ఇంట్లో సోదాలు జరిపిన ఐటీ అధికారులు, నేటి తమ తొలి టార్గెట్ గా రాష్ట్ర మంత్రి నారాయణను ఎంచుకున్నారు. ఈ వార్త తెలుసుకున్న మీడియా ఐటీ అధికారులు బస చేసిన హోటళ్ల ఎదుట మాకాం వేసి వారి వెంటే ఫాలో కావడంతో.. గత్యంతరం లేని పరిస్థితుల్లో అధికారులు ప్లాన్ బి ని అమలుపర్చారు.

ఇప్పటికే పలు నారాయణ కాలేజీలకు చేరుకున్న ఐటీ అధికారులు, భారీఎత్తున పోలీసు భద్రత మధ్య సోదాలను ప్రారంభించారు. మీడియా అంతా చిత్రీకరిస్తున్న కారణంగా వారిని హెచ్చరించిన అధికారులు తమను వెంబడించవద్దని కూడా చెప్పారు. ఇక చివరగా పోలీసులను అడ్డుగా పెట్టుకుని వెనుదిరిగే ప్రయత్నంలో రెండు రియల్ ఎస్టేట్ కంపెనీలను టార్గెట్ చేసుకున్నారు. వాటిలో విజయవాడ పరిధిలోని సదరన్ డెవలపర్స్ కార్యాలయం ఒకటి. ఈ సంస్థలో సోదాల సందర్భంగా అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

వివిధ ప్రాంతాల్లోని కార్యాలయాల్లో రైడ్స్ జరుగుతూ ఉండగా, సదరన్ కార్యాలయం నుంచి ఏపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఓ మంత్రికి సంబంధించిన లావాదేవీల డాక్యుమెంట్లను అధికారులు కనిపెట్టి, వాటిని తమ అధీనంలోకి తీసుకున్నారని సమాచారం. సదరు మంత్రి ఇటీవలి కాలంలో పలు ప్రాంతాల్లో భూముల లావాదేవీలను జరుపగా, వాటన్నింటిపైనా ముందు నుంచే నిఘా పెట్టిన ఐటీ అధికారులు, ఈ సోదాల్లో వాటిని గుర్తించారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై ఐటీ అధికారుల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles