స్వచ్ఛతకు నిర్వచనం చెప్పిన సీఎం.. నెటిజనుల ప్రశంసలు

Puducherry cm gets into drain cleans it for swachhata hi seva mission

v narayanasamy, Puducherry CM, pm modi, swachhata hi seva, cleanliness, Mahatma Gandhi, Twitter, congress

Puducherry Chief Minister V Narayanasamy’s video of stepping inside a drain and cleaning has been widely shared online. The video was posted by the Chief Minster’s official Twitter account.

స్వచ్ఛతకు నిర్వచనం చెప్పిన సీఎం.. నెటిజనుల ప్రశంసలు

Posted: 10/02/2018 04:10 PM IST
Puducherry cm gets into drain cleans it for swachhata hi seva mission

ప్రభుత్వం చేపట్టే ఏ వినూత్న కార్యక్రమానికైనా ప్రధాని నరేంద్రమోడీ నుంచి గ్రామస్థాయి సర్పంచుల వరకు ఎవరైనా సరే.. దివంగత దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు చెప్పినట్లు ‘‘కడుపుల సల్ల కదలకుండా కారులోన వచ్చిండ్రు.. ఫోటోలకు ఫోజులిచ్చి వెనక్కు చూడకుండ పోయిండ్రు’’ కొద్దిసేపు హంగామా చేసి ఆ వెంటనే అక్కడ ఎక్కడి వేసిన గొంగలి అక్కడే వున్నా తమ పని అయిపోయిందని వెళ్లిపోతుంటారు. అయతే వీరందరికీ భిన్నంగా వ్యవహరించారు ఆ సీఎం.

ఎవరాయనా..? అంతగా ఆయన ఏం చేశారు.? అనేదాగా మీ డౌట్.? ఆయన కేవలం ఫోటోలకు ఫోజులివ్వకుండా ఏకంగా మురికి కాలువలోకి దిగి.. పార పట్టుకుని స్వయంగా కాలువను శుభ్రం చేశారు. ఆయన చిత్తశుద్దికి నెట్ జనులు ఫిదా అవుతూ.. లైకులు, షేర్లు చేసేస్తున్నారు. ఇంతకీ ఆయనెవరూ.? అంటే  పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణ స్వామి.

ఆయన కాలువ శుభ్రం చేస్తున్న వీడియో ముఖ్యమంత్రి అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేయగా ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛభారత్‌ ఉద్యమంలో భాగంగా నారాయణ స్వామి స్వయంగా కాలువ శుభ్ర పరిచే కార్యక్రమం చేపట్టారు. ఎక్కువ మంది ప్రజలను స్వచ్ఛభారత్‌ మిషన్‌లో పాల్గొనేలా చేయాలని మోదీ పిలుపు మేరకు ఆయన ఈ విధంగా చేశారు.

కాంగ్రెస్‌ నేత అయిన నారాయణ స్వామి వీడియోలో తెల్లని బట్టలు వేసుకుని కనిపించారు. తన దోతిని పైకి పెట్టుకుని నెల్లితోపె ప్రాంతంలోని మురికి కాలువలోకి దిగి పార పట్టుకుని చెత్తను పారతో తీసి బయటకు వేసి కాలువను శుభ్రం చేశారు. ఆయన కాలువ శుభ్రపరుస్తుండగా చుట్టూ చాలా మంది నిలబడి ఉన్నారు. వీడియోను ఇప్పటికే ఆన్‌లైన్‌లో చాలా మంది వీక్షించారు. వందల మంది షేర్‌ చేశారు. ఆయనను అభినందిస్తూ ఎంతో మంది కామెంట్లు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : v narayanasamy  Puducherry CM  pm modi  swachhata hi seva  cleanliness  Mahatma Gandhi  Twitter  congress  

Other Articles