Kisan Kranti Yatra: center says no to loan waiver గాంధీ జయంతి సాక్షిగా.. రైతులపై విరిగిన లాఠీ..

Kisan kranti yatra rajnath singh meets farmers says no to loan waiver

kisan kranti yatra, kisan kranti yatra live, kisan andolan today news, kisan kranti yatra news, kisan kranti yatra live video, kisan kranti yatra video, kisan krantiyatra delhi, kisan kranti yatra today news, bhartiya kisan union farmers, bhartiya kisan union farmers protest, bhartiya kisan union farmers today news, delhi news, live news

The protesters were stopped along the Delhi-Uttar Pradesh border earlier in the day as police used teargas shells and water cannons to disperse them.

మోడీ మార్క్: గాంధీ జయంతి సాక్షిగా.. రైతులపై విరిగిన లాఠీ..

Posted: 10/02/2018 02:36 PM IST
Kisan kranti yatra rajnath singh meets farmers says no to loan waiver

తమ డిమాండ్లు పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీలోకి ర్యాలీగా దూసుకోస్తున్న అన్నదాతల కిసాన్ క్రాంతి యాత్ర ఉద్రిక్తంగా మారింది. గాంధీజీ 150వ జయంతి దినోత్సవం సందర్భంగా శాంతియుతంగా ర్యాలీని కొనసాగిస్తూ వస్తు్న రైతన్నలను ఢిల్లీలోకి అడుగుపెట్టనీయకుండా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. తమ శాంతియుత ర్యాలీని పోలీసులు ఎందుకు నిలువరిస్తున్నారని ప్రశ్నించిన రైతులు ఆందోళనకు దిగారు.

తమ రాకను అడ్డుకునేందుకు బ్యారికేడ్ల సరిపోవంటూ వాటిని తొలగించి మరీ ముందుకు సాగారు. ఈ క్రమంలో పోలీసులు వారిపై భాష్పవాయువు‌, వాటర్ క్యానన్లను ఉపయోగిస్తున్నారు. కాగా రైతు సంఘాల నేతల అందోళన నేపథ్యంలో క్రాంతి యాత్రను నిర్వహిస్తున్న రైతు సంఘాల నేతలను పిలిచిన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వారితో చర్చలు నిర్వహించారు. దాదాపుగా రైతుల డిమాండ్ల అన్నింటినీపై సానుకూలంగా కేంద్రం స్పందించిందని విశ్వసనీయ సమాచారం. అయితే రైతుల రుణమాఫీపై మాత్రం అంగీకరించని కేంద్రం.. అక్కడే మెలిక పెట్టడంతో.. రైతన్నల అంధోళన ఇంకా కొనసాగుతుంది.

కాగా రైతుల రుణమాఫీ, మద్దతు ధర, విద్యుత్ ఛార్జీలు తగ్గింపుతో పాటు పెరుగుతున్న ఇంధన ధరలను కూడా తగ్గించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఉత్తరాఖండ్ లోని హరిద్వార్‌ నుంచి సెప్టెంబరు 23న కిసాన్‌ క్రాంతి ర్యాలీ ఆరంభించి.. ఇవాళ దేశ రాజధాని డిల్లీ వద్దకు చేరుకున్నారు. అయితే ఉత్తర్ ప్రధేశ్ నుంచి ఢిల్లీకి చేరుకునే రహదారులన్నింటినీ తమ అధీనంలోకి తీసుకున్న పోలీసులు.. ఎక్కడికక్కడ రైతులను బ్యారికేడ్ల సాయంతో నిలువరించారు.   రైతులను నగరంలోకి పోలీసులు అనుమతించడం లేదు.

ఉత్తరప్రదేశ్-ఢిల్లీ సరిహద్దు ప్రాంతంలోనే కిసాన్ క్రాంతి యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు వాటర్‌ క్యానాన్లు ప్రయోగించి కిసాన్ ఘాట్‌కు వెళ్తున్న రైతులను అడ్డుకున్నారు. దీంతో ఆ మార్గంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకెళ్లేందుకు వేలాదిమంది రైతులు యత్నించారు. దీంతో ఘజియాబాద్ పరిసరాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. అయితే  శాంతియుతంగా నిరసన చేస్తున్న తమను అడ్డుకోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు రైతులకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మద్దుతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన తన ట్విట్టర్ స్పందిస్తూ.. ఇకపై తమ అభ్యర్థనలు తెలుపుకునేందుకు కూడా రైతులు ఢిల్లీకి రాకూడదా.? అంటూ ప్రశ్నించారు. కేంద్రప్రభుత్వానికి తమ అభ్యర్థనలు చెప్పుకునే హక్కు కూడా రైతులకు లేదా.? అని ప్రశ్నించారు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా రైతన్నలకు మద్దతు తెలిపారు. రైతులను నగరంలోకి ప్రవేశించేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులను ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన సూటిగా ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kisan Kranti Padyatra  farmers  delhi  Arvind kejriwal  farmers protest  water cannons  delhi police  

Other Articles