BJP MP caught napping during PM's speech ప్రధాని ప్రసంగమా.? జోలపాటా.?

Caught on cam bjp mp napping during pm modi s speech

Ayushman Bharat Scheme, BJP MP caught sleeping, PM Modi, BJP, MP Rabindra Rai, sleep, napping, Speech, Kodarma, PMJAY, Jharkhand, caught on cam, viral video

Ravindra Rai from Jharkhand's Kodarma constituency on Sunday landed into a controversy after he was spotted sleeping during the launch of 'Ayushman Bharat - Pradhan Mantri Jan Aarogya Yojana (AB-PMJAY)' here in Jharkhand.

ITEMVIDEOS: ప్రధాని ప్రసంగం అసాంతం జోలపాటలా వుందా నాయనా..!

Posted: 09/25/2018 11:05 AM IST
Caught on cam bjp mp napping during pm modi s speech

దేశంలోని తెలుగు రాష్ట్రాలకు మినహాయించి అన్ని రాష్ట్రాలలో అమల్లోకి వచ్చిన పథకం అయుష్మాన్ భారత్. ఈ పథకాన్ని ఈ జార్ఖండ్ లో రాంచీలో ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మోదీ ఒకవైపు.. ఆయుష్మాన్ భారత్ పథకానికి సంబంధించి ప్రసంగిస్తూ.. ఈ పథకంలో దేశంలోని పేద, బడుగు, బలహీరవర్గాలకు చెందిన వారందరికీ ఐదు లక్షల రూపాయల అరోగ్య భీమా సౌకర్యాన్ని అందిస్తుందని, ప్రభుత్వంతో పాటు ఫ్యానెల్ లోని అన్ని ప్రైవేటు అస్పత్రుల్లో ఈ పథకం వర్తిస్తుందని కూడా చెప్పారు.

ఇలా ప్రధాని మోడీ ఓ వైపు వేదికపై ప్రసంగిస్తున్న క్రమంలోనే మరోవైపు వేదికపై కూర్చొన్న బీజేపీ ఎంపీ గుర్రు బెట్టి మరి నిద్రపోయారు. ఈ దృష్యాలు కెమెరాకు చిక్కడంతో అది కాస్తా నెట్టింట్లో వైరల్ గా మారింది. కేంద్ర ప్రభుత్వం తమ గొప్పదనంగా తీసుకువచ్చిన ప్రతిష్ఠాత్మ పథకాన్ని ప్రారంభిస్తున్న సభలో.. అందులోనే ప్రధాని మోదీ ప్రసంగిస్తున్న తరుణంలో బీజేపీ ఎంపీ రవీంద్ర రాయ్ ఏమాత్రం జంకుబోంకు లేకుండా హాయిగా కునుకుతీస్తూ.. కెమెరాల కంటికి చిక్కాడు. ఇంకేముందు ఈ వీడియో నెట్టింట్లో సంచలనంగా మారింది.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. బాధ్యతారహితంగా ప్రవర్తించారంటూ ఎంపీ రాయ్ పై విమర్శలు గుప్పించారు. ప్రధాని పథకం గురించి వివరిస్తున్న క్రమంలో.. తన సోంత పార్టీ ఏంపీలే నిద్రపోతుంటే ఇక ప్రజలకు వారు పథకం గురించి ఎలా విమర్శిస్తారంటూ కూడా విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు ఎంపీ వేదికపై నిద్రపోవడంపై విపక్షాలు కూడా చురకలంటించాయి. ఇక నెట్ జనులు మాత్రం ప్రధాని ప్రసంగం తమ పార్టీ ఎంపీలకే జోలపాటలా మారి నిద్రబుచ్చుతుందని వ్యంగ్యవ్యాఖ్యలు కూడా చేశారు. ఇక దీనిపై బీజేపి స్పందించాల్సి వుంది. ఆ వీడియోను వీరూ ఒకలుక్కేయండీ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ayushman Bharat  BJP MP sleeping  PM Modi  Rabindra Rai  Kodarma  Jharkhand  viral video  

Other Articles