Upasana and Sindhu are Tycoons of Tomorrow ఉపాసన, సింధూలకు ఫోర్బ్స్ జాబితాలో స్థానం

Upasana and sindhu in forbes india tycoons of tomorrow

Upasana konidela, PV Sindhu, Forbes India, Tycoons of Tomorrow, 22 members list, innovators, entrepreneurs, actors, sportspersons, shuttler, Apollo Life

Forbes magazine has released the latest list of Tycoons of Tomorrow. Out of the 22 members listed by the magazine, upasana konidela and PV Sindhu also found their names in the list.

ఉపాసన, సింధూలకు ఫోర్బ్స్ జాబితాలో స్థానం

Posted: 09/25/2018 11:57 AM IST
Upasana and sindhu in forbes india tycoons of tomorrow

శక్తివంత సంపన్నులో ఒలంపిక్ పతక విజేత పీవీ సింధు, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన స్థానం సంపాదించారు. వ్యాపారం, వాణిజ్యం, నటన, క్రీడలకు సంబంధించి మన దేశానికి చెందిన 22మందితో కూడిన జాబితాను టైకూన్స్ ఆఫ్ టుమారో పేరిట తాజాగా ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసింది. ఆయా రంగాల్లో వారు చూపుతున్న ప్రతిభను బట్టే వీరిని ఎంపిక చేశామని.. నికర సంపదను ప్రామాణికంగా తీసుకోలేదని ఫోర్బ్స్ స్పష్టం చేసింది,

ఇక ఇదే జాబితాలో అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఈజడ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కరణ్‌ అదానీ, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అనంత్‌ గోయెంకా, ఫ్యూచర్‌ కన్జూమర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆశ్ని బియానీ, బిర్లా వారసురాలు, స్వాతంత్య్ర మైక్రోఫైనాన్స్‌ వ్యవస్థాపకురాలు, క్యూరోకార్ట్‌-ఎంపవర్‌ సహ వ్యవస్థాపకురాలు అనన్య బిర్లా, యెస్‌ బ్యాంక్‌ సీఈఓ రాణా కపూర్‌ కుమార్తె, త్రీ సిస్టర్స్‌-ఇన్‌స్టిట్యూషనల్‌ ఆఫీస్‌ వ్యవస్థాపకురాలు రాధా కపూర్‌, పార్లే ఆగ్రోకు చెందిన నదియా చౌహాన్‌, ఐడి ఫ్రెష్‌ ఫుడ్‌ సహ వ్యవస్థాపకులు పీసీ ముస్తాఫా వున్నారు.

వీరితో పాటు ఫ్రెష్‌ వర్క్స్‌ వ్యవస్థాపకులు గిరీశ్‌ మాతృబూథమ్‌, జెరోధా సహ వ్యవస్థాపకులైన నిఖిల్‌ కామత్‌ - నితిన్‌ కామత్‌, మెట్రోపోలిస్‌ హెల్త్‌కేర్‌కు చెందిన అమీరా షా, బిబా ఆపెరల్‌ ప్రతినిధి సిద్ధార్థ బింద్రా, సియట్‌కు చెందిన అనంత్‌ గోయెంకా, యూపీఎల్‌ నుంచి విక్రమ్‌ ష్రాఫ్‌, స్థిరాస్తి సంస్థ లోధా గ్రూప్‌నకు చెందిన అభిషేక్‌ లోధా, క్లియర్‌ట్యాక్స్‌ వ్యవస్థాపకులు అర్చిత్‌ గుప్తా, మాసివ్‌ రెస్టారెంట్స్‌ వ్యవస్థాపకులు జొరావర్‌ కల్రా, నటులు విక్కీ కౌశల్‌, భూమి పడ్నేకర్‌, బిరా 91 బీర్‌ వ్యవస్థాపకులు అంకుర్‌ జైన్‌, ఓయో రూమ్స్‌ నుంచి రితేశ్‌ అగర్వాల్‌‌లు చోటు దక్కించుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Forbes magazine  Tycoons of Tomorrow  Upasana konidela  PV Sindhu  India  

Other Articles