no compromise between vangaveeti radha and YCP రాజకుంటున్న బెజవాడ సెంట్రల్.. వెనక్కు తగ్గని వైసీపీ, రాధా

No compromise between vangaveeti radha and ycp

vangaveeti radha, Vijayawada Central. Kapu Icon, Vangaveeti Ranga, Gautham Reddy, YSR Congress, TDP, JanaSena, Pawan Kalyan, Chandrababu, YS Jagan Mohan Reddy, Malladi Vishnu, PrajaRajyam, Andhra pradesh, Politics

Even after resignations warnings from prominent kapu leader Vangaveeti Radha, who is aspirant of vijayawada central seat, YCP high command does step back in allocation the said seat to malladi vishnu.

రాజకుంటున్న బెజవాడ సెంట్రల్.. వెనక్కు తగ్గని వైసీపీ, రాధా

Posted: 09/18/2018 11:25 AM IST
No compromise between vangaveeti radha and ycp

విజయవాడ సెంట్రల్ సీటు విషయంలో వైసీపీ, వంగవీటి రాధాల మద్య ఏర్పడిన సంక్షోభానికి తెరపడటం లేదు. అటు వైసీపీ అధిష్టానంతో పాటు ఇటు రాధా కూడా బెట్టు వీడకపోవడంతో ఇక తాడో పేడో తేల్చుకునేందుకు రాధా అనుచరులు రంగం సిద్దం చేస్తున్నారు. పార్టీ కండువాలను మోస్తున్న నాయకులను కాదని, కొత్తగా వలసవచ్చిన నేతలకు టికెట్లను ఇవ్వడం ఏంటని రాధా అనుచరులు ప్రశ్నిస్తున్నారు.

మాట తప్పను, మడమ తిప్పను అనే వైసీపీ నేత.. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన నేతలను కాదని, వలస నాయకులకు టికెట్లను ఎలా ఇస్తారని నిలదీస్తున్నారు. అయితే వంగవీటి రాదా అనుచరుల హెచ్చరికలను కూడా లైట్ గా తీసుకన్న వైసీపీ నేతలు.. సెంట్రల్ సీటు విషయంలో ఏమాత్రం పునరాలోచనలో పడ్డట్టు కనిపించడం లేదు. పైగా సెంట్రల్ నియోజకవర్గ సమన్వయ కర్తగా రాధాను తప్పించి ఆ బాధ్యతలు మల్లాది విష్ణుకు అప్పగించేసింది.

రాధాకు మచిలీపట్నం ఎంపీ స్థానం లేదా, తూర్పును మాత్రమే కేటాయిస్తామని వైసీపీ అధిష్టానం చెబుతోంది. దీంతో భవిష్యత్ కార్యాచరణపై రాధా దృష్టి పెట్టారు. రాధా రంగ మిత్రమండలి, సన్నిహితులతో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే సెంట్రల్ సీటు మల్లాది విష్ణుకు ఇస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ విషయంలో వంగవీటి కుటుంబం అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ క్రమంలో వంగవీటి కుటుంబీకుడు శ్రీనివాస ప్రసాద్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles