SC Allows Karti Chidambaram to Travel abroad సుప్రీంకోర్టులో కార్తి చిదంబరానికి ఊరట

Aircel maxis case supreme court allows karti chidambaram to travel abroad

Supreme Court, Karti Chidambaram, P Chidambaram, United Kingdom, Karti foreign travel, Aircel-Maxis, INX media, money laundering cases, BJP, Congress, ED, CBI, United Kingdom, Abroad

The Supreme Court of India has allowed Karti Chidambaram to travel abroad from 20 September to 30 September in the Aircel-Marxis case.

సుప్రీంకోర్టులో కార్తి చిదంబరానికి ఊరట

Posted: 09/18/2018 12:16 PM IST
Aircel maxis case supreme court allows karti chidambaram to travel abroad

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కేంద్ర మాజీ ఆర్థకశాఖ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత చిదంబరం తనయుడు కార్తి చిదంబరంకు ఊరట లభించింది. అవినీతి, మనీలాండరింగ్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను విదేశాలకు అనుమతించవద్దన్న సీబిఐ, ఈడి తరపు న్యాయవాదులు వాదనలతో విభేధించిన అత్యున్నత న్యాయస్థానం కార్తి చిదంబరాన్ని విదేశాలకు వెళ్లేందుకు అనుమతిని మంజూరు చేసింది.

తన కుమార్తె కాలేజీ అడ్మీషన్ కోసం కార్తి చిదంబరం బ్రిటన్ వెళ్లేందుకు సుప్రీంకోర్టు అనుమతి కోరడంతో దానిపై విచారించిన న్యాయస్థానం అనుమతినిచ్చింది. ఈ నెల 20 నుంచి సెప్టెంబర్ 31 వరకు బ్రిటన్ లో పర్యటించేందుకు అనుమతి కోరగా...దేశ సర్వోన్నత న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. ఎయిర్‌సెల్-యాక్సిస్, ఐఎన్ఎక్స్ మీడియా, మనీలాండరింగ్ కేసుల్లో కార్తి చిదంబరం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రిమినల్ కేసులను సీబీఐతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుపుతున్నాయి.

గతంలోనూ కార్తి చిదంబరం సుప్రీంకోర్టు అనుమతితో విదేశాల్లో పర్యటించారు. జులై 23 నుంచి 31 వరకు బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికాలో ఆయన పర్యటించారు. కార్తి చిదంబరం మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతివ్వొద్దంటూ ఈడీ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఆయన విదేశీ పర్యటనకు వెళ్తే కేసు దర్యాప్తు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని వాదించారు. అయితే గతంలో ఇచ్చిన షరతులకు లోబడి కార్తి చిదంబరం నడుచుకున్నందున కార్తి చిదంబరానికి అనుమతిని ఇచ్చింది న్యాయస్థానం.

కాగా బ్రిటన్ పర్యటన పిటీషన్ పై ఇరుతరఫు వాదనలు విన్న సుప్రీంకోర్టు కొన్ని షరతులకు లోబడి ఆయన బ్రిటన్ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి మంజూరు చేసింది. బ్రిటన్ పర్యటనలో కార్తి చిదంబరం అక్కడి బ్యాంకుల్లోని ఖాతాలను మూయడం కానీ, కొత్త ఖాతాలను తెరవడంకానీ చేయకూడదని కోర్టు షరతు విధించింది. విమానం బయలుదేరే సమయం, తిరిగి భారత్‌కు వచ్చే వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. అలాగే విదేశీ పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగివచ్చిన వెంటనే పాస్‌పోర్టును దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని కార్తి చిదంబరంను సుప్రీంకోర్టు ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Supreme Court  Karti Chidambaram  P Chidambaram  United Kingdom  Karti foreign travel  ED  CBI  

Other Articles