Selfies With Harikrishna's Dead Body సెల్పీ పరాకాష్ట: హరికృష్ణ మృతదేహంతో కూడానా.?

Selfie with nandamuri harikrishna s dead body goes viral

nandamuri hari krishna, kamineni hospital, para medical staff, narketpally, jr NTR, Kalyan Ram, crimenandamuri hari krishna, kamineni hospital, para medical staff, narketpally, jr NTR, Kalyan Ram, crime

In what could be seen as a shameful act the nursing staff at Kamineni hospital that treated Nandamuri Harikrishna took a selfie with his corpse.

సెల్పీ పరాకాష్ట: హరికృష్ణ మృతదేహంతో కూడానా.?

Posted: 08/31/2018 04:37 PM IST
Selfie with nandamuri harikrishna s dead body goes viral

సెల్ఫీల మోజు పరాకాష్టకు చేరింది. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడతున్న వారిని రక్షించే క్రమంలో వైద్యులకు సహాయంగా వుండాల్సిన పారా మెడికల్ స్టాప్ సిబ్బంది.. ఆ పని మానేసి మరణించిన వారు సెలబ్రిటీ అనేసరికి వారి మృతదేహాలతో సెల్ఫీలు దిగుతూ.. వాటిని నెట్టింట్లో యదేశ్చగా పోస్టుచేస్తూ.. కామెంట్లు, లైకుల కోసం పాకులాడుతున్నారు. మనుషులమన్న మాట మర్చిపోయి మానవత్వం మంటగలిసేల ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీలు దిగుతున్న వీరి కన్నా శవాలను పీకుతినే రాబంధులే చాలా నయం అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మృత్యుముఖంలో ఉన్న వ్యక్తిని చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకువస్తే... ఆయన సెలబ్రెటీ అని..ఫొటోలు దిగేంత కర్కశత్వం మనుషుల్లో పేరుకుపోయిందా? కామినేని ఆస్పత్రిలో హరికృష్ణ విషయంలో జరిగిన వ్యవహారం చూస్తే పెరిగిపోయిందని నమ్మక తప్పదు. కొనఊపిరితో ఉన్న హరికృష్ణను కామినేని ఆస్పత్రికి తీసుకువచ్చారు. క్షణాల్లో లైఫ్ సపోర్టుమీద ఉంచాల్సిన సిబ్బంది సెల్ఫీలు తీసుకుంటూ కాలం గడిపిన విషయం బయటకు వచ్చింది. ఈ సెల్ఫీలు బయటకు రావడం కలకలం రేపుతోంది.
 
హరికృష్ణ భౌతిక కాయంతో ఆస్పత్రి సిబ్బంది టెన్షన్ పడకుండా సెల్ కెమెరావైపు చూస్తూ సెల్ఫీలు తీసుకోడం చర్చనీయాంశమవుతోంది. అంబులెన్స్ శబ్దం వినిపిస్తే రోడ్డుపై వెళ్లేవాళ్లు వీలైనంత వరకు దారి ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. తాము ఎంత అర్జంట్ పనిమీద ఉన్నా పక్కకు తప్పుకుంటారు. కానీ ఆస్పత్రిలో సిబ్బంది ఏం చేస్తున్నారు. రోగి చికిత్స విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. అదే వీఐపీ రోగులు అయితే సెల్ఫీలు కూడా తీసుకుంటున్నారు. కామినేని ఆస్పత్రిలో అదే జరిగింది. దీనిపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nandamuri hari krishna  kamineni hospital  para medical staff  narketpally  jr NTR  Kalyan Ram  crime  

Other Articles