Lalu Prasad Yadav's wife, son granted bail లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి స్వల్ప ఊరట

Lalu prasad yadav s wife son granted bail in irctc scam

Lalu Prasad Yadav, IRCTC scam, Ex-Railway minister Lalu Prasad Yadav, Rashtriya Janata Dal (RJD), Rabri devi, tejeswi yadav, patialia house court Politics,

A Delhi court today granted bail to RJD supremo Lalu Prasad's wife Rabri Devi and son Tejashwi Yadav in an Indian Railway Catering and Tourism Corporation (IRCTC) scam case

లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి స్వల్ప ఊరట

Posted: 08/31/2018 04:36 PM IST
Lalu prasad yadav s wife son granted bail in irctc scam

ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి ఊరట లభించింది. ఆయన సతీమణి రబ్రీదేవి, కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ లకు ఢిల్లీలోని పాటియాల హౌజ్ కోర్టులో స్వల్ప ఊరట లభించింది. వీరికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. వీరితో పాటు ఈ కేసులో అభియోగాలను ఎదుర్కొంటున్న వారందరికీ బెయిల్ మంజూరు చేసింది.

నిందుతులు తమకు బెయిల్ మంజూరు చేయాలని దాఖలు చేసిన పిటీషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. ఈ కేసులో అభియోగాలను ఎదర్కోంటున్న అందరికీ బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు విచారణ చేపట్టిన న్యాయస్థానం వ్యక్తిగత పూచికత్తు కింద రూ.లక్ష రూపాయల చోప్పున జమ చేయాలని చెబుతూ వారికి బెయిల్ మంజూరి చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 6వ తేదీకి వాయిదా వేసింది. రాంచీలో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నేపథ్యంలో లూలూ కోర్టుకు హాజరుకాలేదు.

లాలూ ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఐఆర్సీటీసికి హోటళ్ల టెండర్లకు సంబంధించిన కుంభకోణం కేసులో లాలూకు, ఆయన భార్య రబ్రీదేవికి, తనయుడు తేజస్వీ యాదవ్ లకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. రాంచీ, పూరీలో ఉన్న రెండు ఐఆర్సీటీసీ హోటళ్లను సుజాత హోటల్స్ అనే ప్రైవేటు కంపెనీకి అక్రమంగా కట్టబెట్టి.. వారి నుంచి క్విడ్ ప్రోకో కింద లబ్ది పోందినట్టు సీబీఐ వాదిస్తోంది. ఈ హోటల్ యజమానులు లాలూ కుటుంబానికి అత్యంత సన్నిహితులని ఆరోపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lalu Prasad Yadav  IRCTC scam  Rabri devi  tejeswi yadav  patialia house court  

Other Articles