Switch to chip debit cards by Dec 31: SBI మీ ఎస్బీఐ ఏటీయం కార్డును మార్చేసుకున్నారా.?

Switch to emv chip debit cards by dec 31 sbi tells customers

EMV chip debit cards, ‘Europay MasterCard Visa’, State Bank of India, SBI, ATM card, magnetic strip, EVM chip, skimming, Frauds, Aadhaar number, trai, RBI, protect money, data thieves, banks, Antivirus software

Country’s largest lender State Bank of India (SBI) has asked its customers to get their ATM-cum-debit cards with magnetic stripe replaced with the one with EMV chip before December 31.

మీ ఎస్బీఐ ఏటీయం కార్డును మార్చేసుకున్నారా.?

Posted: 08/27/2018 11:55 AM IST
Switch to emv chip debit cards by dec 31 sbi tells customers

మీకు భారతీయ స్టేట్ బ్యాంకు (స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) ఎస్బీఐ కస్టమర్లా.. మీకు ఎస్బీఐలో అకౌంట్ ఉందా. ఐతే.. ఈ వార్త మీకోసమే. మీరు వెంటనే వెళ్లి మీ పాత ఏటీయం కార్డులను బ్యాంకులో సమర్పించి వాటి స్థానంలో కొత్తగా వచ్చిన ఏటీయం డెబిట్ కార్డులను తీసుకోవాల్సిందే. తాజాగా అర్బీఐ జారీ చేసిన ఆదేశాల నేపథ్యంలో ఒక్క పైసా ఖర్చు కూడా లేకుండా ఎస్బీఐ తమ కస్టమర్లకు కొత్త ఏటీయం డెబిట్ కార్డులను అందజేస్తుంది.

అయితే పాత కార్డులు (మాగ్నటిక్‌ స్ట్రిప్‌ డెబిట్‌ కార్డులు) ఈ ఏడాది డిసెంబరు 31 నుంచి పనిచేయబోవని బ్యాంకు అధికారులు ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. వాటి స్థానంలో తమ కస్టమర్లు చిప్‌ కార్డులు మార్చుకోవాలని బ్యాంక్ అధికారులు సూచించారు. మాగ్నటిక్‌ స్ట్రిప్‌ కార్డ్ కు బదులుగా… ఈఎంవీ(యూరో పే మాస్టర్‌కార్డు వీసా) చిప్‌ కార్డులను తీసుకోవాలని కోరుతోంది. ఇప్పటికే చాలా కార్పొరేట్ బ్యాంకులు  చిప్ ఆధారిత డెబిట్, క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి.

ఈ చిఫ్ అనుసంధాన యూరో పే మాస్టర్ కార్డు వీసా ఏటీయం కార్డులతో ఆన్ లైన్ బ్యాంకు లావాదేవీలు సులువుగా జరపుకోవడంతో పాటు… మోసపూరిత లావాదేవీల నుంచి ఖాతాదారుల డబ్బులకు భద్రత కల్పించేందుకు.. ఈ చిప్ కార్డులు ఎంతో ఉపయోగపడతాయి. వినియోగదారులకు మరింత సెక్యూరిటీ ఇస్తూ.. చిప్ కార్డులు జారీచేయాలని ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ఈ మార్గదర్శకాలను తాజాగా ఎస్బీఐ అమలుపరుస్తోంది.

సైబర్ నేరగాళ్లు స్కిమ్మింగ్ లాంటి నేరాలు చేయకుండా చిప్ కార్డ్ అడ్డుకుంటుంది. కార్డును ఎవరైనా దొంగతనం చేసినా… వెంటనే బ్లాక్ చేయడానికి, బ్యాంక్ సిబ్బంది వెంటనే కార్డును యాక్సెస్ చేయడానికి వీలవుతుంది. అందుకే… తమ ఖాతాదారులకు బ్యాంక్ విన్నపం చేస్తోంది. మాగ్నటిక్‌ స్ట్రిప్‌ డెబిట్‌ కార్డులు.. అంటే ప్రస్తుతం చాలామంది దగ్గరున్న డెబిట్ కార్డుల స్థానంలో EMV చిప్‌ డెబిట్‌ కార్డును డిసెంబరు 31, 2018లోగా  మార్చుకోవాలని విజ్ఞప్తిచేస్తోంది.

కొత్త కార్డ్ పొందేందుకు ఎటువంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని బ్యాంక్ తెలిపింది. అకౌంట్ హోల్డర్లకు చిప్ కార్డును ఫ్రీగా ఇస్తున్నారు. కార్డు మార్చుకోవాల్సినవారు.. బ్యాంక్ ఖాతాలో సంప్రదించాల్సి ఉంటుంది. కార్డుకు, అందులో ఉన్న డబ్బుకు రక్షణ పెరుగుతుందని… ఖాతాదారులకు, బ్యాంకులకు టెన్షన్ తగ్గుతుందని బ్యాంక్ చెబుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SBI  ATM card  magnetic strip  EVM chip  skimming  Frauds  Aadhaar number  

Other Articles