Hyderabad twin blasts verdict deferred to September 4 హైదరాబాద్ జంటపేలుళ్ల కేసులో తుది తీర్పు వాయిదా..!

Hyderabad twin blasts verdict deferred to september 4

Hyderabad twin blasts, Hyderabad twin blasts case, Hyderabad twin blasts verdict, final verdict, September 4, NIA court, Gokul chat bomb blast case, Lumbini park bomb blast case, Anique Shafiq Syed, Mohammed Sadiq, Akbar Ismail Choudhary, Ansar Ahmed Badhsah Sheikh, Indian Mujahideen, crime

The National Investigation Agency (NIA) special court today deferred the verdict in the 2007 Hyderabad twin bomb blasts case to September 4th.

హైదరాబాద్ జంటపేలుళ్ల కేసులో తుది తీర్పు వాయిదా..!

Posted: 08/27/2018 12:33 PM IST
Hyderabad twin blasts verdict deferred to september 4

భాగ్యనగర చరిత్రలో మాయని మచ్చగా మారిన జంట బాంబు పేలుళ్ల కేసులో తుది తీర్పును న్యాయస్థానం వాయిదా వేసింది. లుంబినీపార్కు, గోకుల్ ఛాట్‌ జంట బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించిన కేసును విచారిస్తున్న ఎన్ఐఏ న్యాయస్థానం తుదితీర్పును వచ్చే నెల 4కు వాయిదా వేసింది. 2007, ఆగస్టు 25న ఇండియన్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాద సంస్థ సభ్యులు ఈ రెండు ప్రాంతాలలో బాంబులు అమర్చి విధ్వంసం సృష్టించిన సంగతి విదితమే. ఈ దుర్ఘటనలో 42మంది మృతి చెందగా... 50 మందికిపైగా గాయపడ్డారు.

జంట పేలుళ్లకు సంబంధించిన నిందితులను ఘటన జరిగిన రెండేళ్లకు అరెస్టు చేసిన పోలీసులు.. ఈ కేసును అక్టోపస్ కు అప్పగించారు. రంగంలోకి దిగిన అక్టోపస్ ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాల సేకరణ, బాధితుల వాంగ్మూలం, అభియోగ పత్రాల నమోదు బాధ్యతను చేప్టటారు. ఈ దుశ్చర్యకు పాల్పడ్డ నిందితులు ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్నారు. అనంతరం ఈ కేసును కేంద్రం జాతీయ దర్యాప్తు సంస్థ (నేషనల్ ఇన్వెటిగేషన్ ఏజెన్సీ) ఎన్ఐఏకు అప్పగించింది.  

దీంతో నాంపల్లిలోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఉగ్రవాదులను విచారణ చేపట్టారు. ఇవాళ కూడా తుది విచారణ జరిపిన తరువాత న్యాయస్థానం తీర్పును వచ్చె నెల 4కు వాయిదా వేసింది. పేలుళ్ల కేసులో అనిక్ షఫిక్, ఇస్మాయిల్ చౌదరి, రియాజ్ భత్కల్‌, ఇక్బాల్ భత్కల్, మహ్మద్ తారీక్, షప్రుద్దీన్, మహ్మద్ షేక్, అమీర్ రిజాఖాన్‌లను నిందితులుగా కోర్టు తేల్చింది. కాగా ఇందులో ముగ్గురు పరారీలో ఉండగా ఐదుగురిపై విచారణ కొనసాగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles