shirdi sai miracle video goes viral on social media "ఓం ఇహైదే.." అనగానే చేతిలో పూలదండ..

Shirdi sai baba miracle video goes viral on social media

shirdi sai baba, shirdi sai miracle, sai miracle video viral, sai miracle viral video, sai miracle video, shirdi sai video on social media, shirdi sai priest, shirdi sai flowers bouquet, viral video, video viral, shirdi sai, miracle, flowers bouquet, priest, viral video, social media

shirdi sai baba miracle video goes viral on social media, as a priest stands in front of sai idol and stretched his hand, suddenly flowers bouquet fall in his hands, the video goes viral on net

ITEMVIDEOS: వైరల్: "ఓం ఇహైదే.." అనగానే చేతిలో పూలదండ.. సాయి మహిమ

Posted: 08/10/2018 03:34 PM IST
Shirdi sai baba miracle video goes viral on social media

షిరిడీ క్షేత్రం సర్వ పుణ్య ధామం అని భక్తులు వ్యాఖ్యానిస్తుంటారు. షిరిడీలో సాయినాథుడు సమాది అయినా.. తన భక్తులకు ఆ సమాధి నుంచే బదులిస్తాడని, వారికి అభయప్రదాతగా మారి కోర్కెలను తీరుస్తాడని సమస్యలను పరిష్కారమార్గాన్ని కూడా చూపుతాడని భక్తులు విశ్వసిస్తుంటారు. ఇప్పటికే షిరిడీ సాయి మహిళలను తెలియజేస్తూ ఎన్నో కథలు ప్రాచుర్యంలో వున్నాయి. తాజాగా నిన్న నెట్టింట్లో పోస్టయిన ఓ వీడియో కూడా సంచలనంగా మారింది. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

షిరిడీ సాయి ఆలయంలో అబిషేకానంతరం జరుగుతున్న కైంకర్యాల క్రమంలో పూజలు నిర్వహించిన భక్తులను కింద నిల్చోబెట్టిగా.. ఓ ఆర్చకుడు మాత్రం సరిగ్గా షిరిడి సాయి విగ్రహం వద్ద ఆయనకు పూజలు నిర్వహిస్తూ వున్నాడు. అదే సమయంలో మిగతా అర్చకులు సాయికి మంత్రోచ్ఛరణ చేస్తున్నారు. సరిగ్గా అర్చకులు "ఓం ఇహైదే..." అని అనగానే అప్పటికే అక్కడున్న అర్చకుడు రెండు చేతులను చాచి నిలబడ్డాడు. అంతే ఆ మంత్రి అలా ముందుకు సాగుతున్న క్రమంలో షిరిడీ సాయి ఒళ్లో వున్న పూల దండ గుత్తి కాస్తా అర్చకుడి చేతిలో పడింది.

ఇలా సాయి తన మహిమలను భక్తులందరికీ చూపాడని.. కొందరు భక్తులు అంటున్నారు. ఈ ప్రక్రియ జరిగిన వెంటనే భక్తులు చప్పట్లతో హర్షధ్వానాలు చేశారు. ఇది సాయి మహిమేనని నమ్ముతున్న ఎంతో మంది దీన్ని వాట్స్ యాప్, ఫేస్ బుక్ మాధ్యమాల్లో షేర్ చేసుకుంటున్నారు.  భగవాన్ శ్రీ సమర్థ సద్గురు సచ్చితానంద సాయినాధుడి ఆలయంలోనే ఇలాంటి మహిమ అవిష్కృతం కావడంతో.. భక్తులు తమ వీడియోను విరివిగా షేర్ చేసుకుంటున్నారు. అయితే ఇది ఏ ఆలయంలో జరిగిందన్న వివరాలు మాత్రం తెలియరాలేదు. ఈ వీడియోను మీరూ చూడండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shirdi sai  miracle  flowers bouquet  priest  viral video  social media  

Other Articles