JSP rolls out innovative red revolution గ్రామాల్లో హోరెత్తిస్తున్న జనసేన ‘రెడ్ రెవల్యూషన్’

Jana sena party rolls out innovative public grievance address system

Pawan Kalyan, Janasena party, West Godavari, satya prasad, Nidadavolu, red revolution, jsp rural parts, village public address system, innovative idea, Amaravati, andhra pradesh, politics

Jana Sena Party Leaders and fans in several parts of the AP state, contribute them selves to the actor turned politician Pawan kalyan party. A new innovative idea from a nidadavolujana sena activist satya prasad (nani) makes JSP party to reach much more to the rural parts of state

గ్రామాల్లో హోరెత్తిస్తున్న జనసేన ‘రెడ్ రెవల్యూషన్’

Posted: 08/06/2018 07:49 PM IST
Jana sena party rolls out innovative public grievance address system

రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయంగా సినీనటుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రజాసమస్యలపై స్థానికంగా అధ్యయనం కోసం, ఆ సమస్యల పరిష్కారం విషయంలో రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకురావడంలో భాగంగా ‘రెడ్ రెవల్యూషన్’ పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో జనసేన స్థానిక నేతలు ఈ ప్రజా సమస్యల ప్రస్తావన కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.
 
ఇందులో భాగంగా.. గ్రామాలన్నీ తిరుగుతూ వివిధ పార్టీల నాయకులు, ప్రజలతో చర్చించి, ప్రధాన సమస్యలను గుర్తించి, వాటిని గ్రామంలోని ఒక గోడపై రాస్తున్నారు, గోడకు ఎరుపు రంగు వేసి దానిపై తెలుపు రంగులో సమస్యలను రాస్తున్నారు. నిడదవోలు నియోజకవర్గంలో జనసేన నాయకుడు కస్తూరి సత్య ప్రసాద్ (నాని) ఈ రెడ్ రెవల్యూషన్‌కు నాయకత్వం వహిస్తున్నారు. ‘మా రెడ్ రెవల్యూషన్ టీం గుర్తించిన సమస్యలన్నింటినీ పార్టీలు తమ ఎన్నికల మానిఫెస్టోలో తప్పనిసరిగా చేర్చాలని మేం డిమాండ్ చేస్తున్నాం.

ఈ సమస్యలకు పరిష్కారం దొరికే వరకు, వార్షిక రాష్ట్ర బడ్జెట్‌లో వీటికి నిధులు కేటాయించే వరకు మా పోరాటం కొనసాగుతుంది’ అని కస్తూరి నాని స్పష్టం చేశారు. ఈ ప్రచారాన్ని మరింత విస్తృతం చేయాలని జనసేన భావిస్తోంది. గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీకి కొంత సానుకూలత ఉంది. పవన్ కల్యాణ్‌ను బాగా ఓన్ చేసుకునే కాపు సామాజికవర్గం ఓట్లు ఈ జిల్లాల్లో గణనీయంగా ఉన్నాయి. అయితే కాపు ఓట్లపై అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు కూడా కొంత ఆశలున్నాయి. కాపు సామాజికవర్గంలో మెజారిటీ మంది మాత్రం జనసేన వైపునే నిలిచే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Janasena party  West Godavari  satya prasad  Nidadavolu  andhra pradesh  politics  

Other Articles