Osama's son married 9/11 hijacker's daughter ఉగ్రబంధం.. లాడెన్ కొడుకు వివాహం అతని కూతరుతో..

Osama bin laden s son marries 9 11 hijacker s daughter

Hamza Bin Laden, Osama bin Laden, Mohammed Atta, terrorism, O2 (United Kingdom), Ahmad, hassan al-attas

Hamza bin Laden, the son of the late Al Qaeda leader Osama bin Laden, has married the daughter of Mohammed Atta, the lead hijacker and one of the ringleaders of the September 2001 terror attacks in the US.

ఉగ్రబంధం.. లాడెన్ కొడుకు వివాహం అతని కూతరుతో..

Posted: 08/06/2018 07:01 PM IST
Osama bin laden s son marries 9 11 hijacker s daughter

అగ్రరాజ్యం అమెరికాను వణికించడంతో పాటు యావత్ ప్రపంచాన్ని భయాందోళనలోకి నెట్టివేస్తున్నది కేవలం ఉగ్రవాదమే. కానీ ఉగ్రవాదులు మాత్రం తమ బంధాలను, అనుబంధాలను పంచుకుంటున్నారు.  ఒకరితో మరోకరు బంధాలు ఎంత దృడంగా బలపడుతున్నాయంటే.. తామంతా ఒకే కుటుంబం అన్నంతలా.. కాదు అంతకు ఎక్కువే అని తాజా పరిణామాల నేపథ్యంలో చెప్పక తప్పదు. ఎందుకంటే ఒక ఉగ్రవాద సంస్థైన అల్ ఖయిదాకు నేతృత్వం వహించిన నాయకుడి కుమారుడికి యుక్తవయస్సు రాగానే.. అలాంటి నాయకుడి కూతురుతోనే వివాహం చేసుకున్నాడు.

భోధపడలేదా.. అమెరికాతో పాటు ప్రపంచాన్ని గడగడలాడించిన 9/11 ఉగ్రవాద దాడుల లీడ్ హైజాకర్ మహ్మద్ అట్టా కుమార్తెతో ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హంజా బిన్ లాడెన్ వివాహం జరిగింది. ఈ విషయాన్ని 'ది గార్డియన్' దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లాడెన్ కుటుంబీకులు వెల్లడించారు. ప్రస్తుతం తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు హంజా సన్నద్ధమవుతున్నాడని, అయితే, అతనితో తమకు సంబంధాలు లేవని వారు వ్యాఖ్యానించారు.

అల్ ఖైదా ద్వారా ప్రతీకార దాడులకు దిగవద్దని తాము హంజాను కోరుతున్నామని చెప్పారు. కాగా, హంజా ఆచూకీని తెలుసుకునేందుకు యూఎస్, బ్రిటన్ తదితర దేశాల నిఘా సంస్థలు గత రెండేళ్లుగా తమవంతు ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతున్న సంగతి తెలిసిందే. అయితే, హంజా ప్రస్తుతం ఆఫ్గనిస్థాన్ లో నివాసం ఉంటున్నట్టు ఊహాగానాలు ఉన్నాయి. గత సంవత్సరం జనవరిలో హంజాను అమెరికా ప్రపంచ ఉగ్రవాదిగా గుర్తిస్తూ ప్రకటన చేసింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles