'Golden Baba' wears 20kg of gold to pilgrimage సాధువు ‘‘స్వర్ణాభరణాల’’ యాత్ర.. పోలీసు భద్రత

With 20 kg of gold rolex watch golden baba undertakes 25th kanwar yatra

Golden baba, sudhir makkar, kanwar yatra, Golden baba in Kanwar Yatra, Golden Baba, delhi to haridwar yatra, Golden baba 25th year kanwar yatra, Gold jewellery, haridwar, Kanwar yatra, Golden baba, Golden baba's jewellery, 25th kanwar yatra

Golden Baba aka Sudhir Makkar, undertaking his 25th Kanwar Yatra this year, is said to be wearing gold jewellery weighing around 20 kgs, worth Rs 6 crore.

‘‘సర్వసంగ పరిత్యాగి’’ స్వర్ణాభరణాలతో కన్వార్ యాత్ర..

Posted: 08/01/2018 04:25 PM IST
With 20 kg of gold rolex watch golden baba undertakes 25th kanwar yatra

స్వయం ప్రకటిత సర్వసంగ పరిత్యాగికి స్వర్ణం మాత్రం ఇష్టం. ఈ బాబాకు.. ఐహిక సుఖాలు, బంధాలపై ఎలాంటి మోజు, అపేక్ష లేదు.. కానీ ఒక్క బంగారంపై తప్ప. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యలనే అరిషడ్ వర్గాలను నియంత్రణలో వుంచుకునే బాబా.. ఒక్క స్వర్ణం విషయంలో మాత్రం తన రూటే సపరేటు అని చూపుతున్నారు. తనకు బంగారంపై మక్కువ ఎక్కువని చెబుతూనే.. అయితే ఈ స్వర్ణాభరణాలతోనే ఆయన ప్రతీ ఏడాది కన్వార్ యాత్రకు వెళ్లడం విశేషం. ఇక ఈ బాబా గారి బంగారానికి సేఫ్టీగా పోలీసుల భద్రత కూడా ఏర్పాటు చేశారు.

గోల్డెన్ పూరీ బాబా అలియాస్ సుధీర్ మక్కర్ బాబా.. ఎన్నో సంవత్సరాలుగా హరిద్వార్ నుంచి కన్వార్ వరకూ జరిగే సాధువుల యాత్రలో పాల్గొంటాడు. ఈ ఏడాదితో 25 వ సారి కన్వర్ యాత్రలో పాల్గొంటున్న ఈ బాబాకు పోలీసులు భద్రత కల్పించారు. ఎందుకంటే ఈ బాబా గారు గతంలో కంటే ఈ సారి మరింత ఎక్కువ బంగారం ధరించడం విశేషం. ఏకంగా 20 కిలోల బంగారు ఆభరణాలు ధరించి ఆయన కన్వార్ యాత్రలో పాల్గొంటున్నారు. ఆయన వంటిపైనున్న బంగారు, వజ్రాభారణాల విలువ సుమారుగా రూ.6 కోట్లు పైచిలుకే ఉంటుంది.

రెండేళ్ల కిందట 2016లో 12 కిలోలు, గతేడాది 14.5 కిలోల బంగారంతో యాత్రలో పాల్గొన్నారు. ఏటా శివభక్తులు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కు చేపట్టే యాత్రను కన్వర్‌ యాత్రగా పిలుస్తారు. గతేడాది గోల్డెన్ బాబా ధరించిన ఆభరణాల్లో 21 గొలుసులు, దేవుడి విగ్రహాలతో కూడిన 21 లాకెట్లు, చేతి కడియాలు, బంగారపు జాకెట్‌, తదితరాలు ఉన్నాయి. ఈ బంగారం ఆభరణాలన్నీ ధరించి ఎస్‌యూవీ పైన కూర్చుని వెళ్తారు.

గతంలో తన వద్ద కొన్ని గ్రాముల బంగారం మాత్రమే ఉండేది.. ఇప్పుడు కిలోల కొద్దీ బంగారం ధరిస్తున్నానంటే అదంతా శివుడి దయేనని పేర్కోవడం’ విశేషం. కేవలం బంగారం మాత్రమే కాదు రూ.27 లక్షలు ఖరీదైన రోలెక్స్ చేతిగడియారం ధరించి, తన బీఎండబ్ల్యూ, మూడు ఫార్చ్చూన్స్, రెండు ఆడి, రెండు ఇన్నోవాలతో ఊరేగింపుగా వెళ్తారు. అలాగే హమ్మర్, జాగ్వార్, లేండ్ రోవర్ లాంటి కార్లను కూడా యాత్ర కోసం అద్దెకు తీసుకుంటారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gold jewellery  haridwar  Kanwar yatra  Golden baba  Golden baba's jewellery  25th kanwar yatra  

Other Articles