Shiv Sena Supports Reservation For Muslims శివసేన సంచలనం.. ముస్లిం రిజర్వేషన్లకు సానుకూలం..

Shiv sena supports 5 per cent reservation for muslims in education

Maharashtra, Shiv Sena, AIMIM, Maratha Reservation Agitation, Muslim Reservation, Uddhav Thackerey, AIMIM MLA, Imitiaz Jaleel, Maharashtra politics

Shiv Sena chief Uddhav Thackeray has voiced support for five percent reservation for Muslims in educational institutions amid the ongoing Maratha agitation,

శివసేన సంచలనం.. ముస్లిం రిజర్వేషన్లకు సానుకూలం..

Posted: 08/01/2018 05:56 PM IST
Shiv sena supports 5 per cent reservation for muslims in education

కరుడుగట్టిన హిందూ పార్టీగా ముద్ర వేసుకున్న శివసేన పార్టీ రానున్న సార్వత్రిక ఎన్నికలలో తమ సత్తాను చూపించాలని భావిస్తుందా.? అంటే ఔననే సంకేతాలు వస్తున్నాయి. కాంగ్రెస్-ఎన్సీపీ ఓటు బ్యాంకుకు తూట్లు పెడుతూ.. గత ఎన్నికలలో సత్తాచాటిన ఎంఐఎం పార్టీని కూడా బలహీనం చేయాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనబడుతుంది. ఆవిర్భావం నుంచి నిన్నటి వరకు హిందూవాదులను, హైందవులకు మద్దతు పలికిన పార్టీ ఇవాళ సంచలన నిర్ణయం తీసుకోవడమే ఇందుకు కారణమైంది.

మహారాష్ట్ర వ్యాప్తంగా స్థానికులైన మరాఠాలు తమకు విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ఐదు శాతం రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేస్తున్న తరుణంలో.. ముస్లిం మైనార్టీలకు విద్యలో 5 శాతం రిజర్వేషన్ కల్పించే అంశానికి శివసేన మద్దతు పలికింది. బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను మహారాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడాన్ని తప్పుబట్టింది. మరాఠా రిజర్వేషన్లతో పాటు ధన్ గర్స్, ముస్లిం, ఇతర రిజర్వేషన్ల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే సూచించారు.

తమ వర్గానికి కూడా రిజర్వేషన్లు కావాలని ముస్లింలు డిమాండ్ చేయడం సమంజసమైనదేనని చెప్పారు. మరోవైపు, శివసేన నిర్ణయాన్ని ఎంఐఎం స్వాగతించింది. ఎంఐఎం ఎమ్మెల్యే ఇంతియాజ్ జలాల్ తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన శివసేనది పాజిటివ్ డెవలప్ మెంట్ అని కొనియాడింది. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఇక బీజేపి మాత్రమే ఈ విషయంలో పునరాలోచణ చేయాలని ఆయన కోరారు. ఇప్పటికీ కొందరు బీజేపి నేతలు ముస్లింలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ.. తమ చర్యలతో తమ వర్గం ప్రజలను టార్గెట్ చేస్తున్నారని అరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles