ఉత్తర్ ప్రదేశ్ లోని ఉన్నావ్ లో ఓ యువతి పట్ల నలుగురు యువకులు సామూహిక అత్యాచారయత్నం చేయగా.. ప్రాణాలను చేతిలో పట్టుకుని వారిని అర్థించి.. అన్నా అంటూ పిలిచి చివరకు వారి చెర నుంచి తప్పించుకోగా, వారిని ఆ ఆకృత్యాన్ని వారు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగానే అది కాస్తా వైరల్ అయ్యి అగంతకులను కటకటాలు లెక్కించేట్లు చేసిన ఘటనను మర్చిపోకముందే.. తాజాగా బిహార్ లో కూడా అలాంటి ఘటనే మరోటి చోటుచేసుకుంది.
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సొంత జిల్లా అయిన నలందాలో సాక్ష్యాత్తు అధికార పార్టీకి చెందిన వ్యక్తులే ఆకృత్యాలకు తెరలేపారు. నలంద జిల్లా ఉస్మాన్ పూర్ కు చెందిన మైనర్ బాలికపై ఆకతాయిలు లైంగిక వేధింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. స్నేహితురాలి ఇంటికి వెళ్లి వస్తానని వెళ్లిన అమ్మాయి.. వారింట్లోకి వెళ్లగానే అక్కడ స్నేహితురాలికి బదులు అధికార పార్టీ నేతల కుమారులు వుండటం.. వారు అమెను బలవంతంగా వారి మధ్యలో కూర్చోబెట్టుకుని తాకరాని చోటల్లా తడిమారు. బాలిక తప్పించుకునేందుకు ఎంత ప్రయత్నం చేసినా ఆ మగమృగాల బలం ముందు ఓడిపోక తప్పలేదు.
అయితే ఇంతటితో అగని ఆ పైశాచిక మృగాలు ఈ మొత్తం ఘటనను తమ సెల్ ఫోన్లో బంధించాయి. ఈ నెల 9న ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో వారి అకృత్యాలు బయటపడ్డాయి. అప్పటివరకు సర్పంచ్ కుమారుడంటూ కాస్తా సంశయించిన బాధిత బాలిక తల్లిదండ్రులు వీడియో కాస్తా నెట్టింట్లో సంచలనంగా మారడంతో పోలీసులకు పిర్యాదు చేశారు. వీడియో ఆధారంగా ప్రధాన నిందితుడైన ఓ గ్రామ సర్పంచ్ కుమారుడిని బీహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు.
నిందితులపై పోస్కో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నలంద ఎస్పీ సుధీర్ కుమార్ వెల్లడించారు. జూన్ 24న కైమూర్ జిల్లాలో ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన మరో ఘటన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిడంతో..ఆ నిందితుడిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. కాగా తాము అధికార పార్టీకి చెందిన వారమన్న అహంభావంతో.. తమపై పోలీసులు కేసులు నమోదు చేయరన్న ధైర్యంతోనే పార్టీ నేతల కుమారులు అకృత్యాలకు పాల్పడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more