Banking transaction tax to replace Income tax ఆదాయ పన్ను స్థానంలో బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ టాక్స్

Banking transaction tax to replace income tax from next financial year

demonetisation, tax reforms, note bandhi, Arthkranti, proposal, Budget 2018-19, PM Narendra Modi, indian economy

Arthakranti is a Pune-based think tank that claims to have suggested PM Modi demonetise Rs 500 and Rs 1,000 currency notes also makes a proposal to replace banking transaction tax (BTT) in place of IT (income tax).

ఆదాయ పన్ను స్థానంలో బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ టాక్స్

Posted: 07/11/2018 03:48 PM IST
Banking transaction tax to replace income tax from next financial year

రెండో పర్యాయం అధికార పగ్గాలను అందుకోవాలన్న ప్రయత్నాల్లో వున్న ప్రధాని నరేంద్రమోడీ, గొప్ప సంస్కరణ దిశగా అడుగులు వేస్తున్నారని సమాచారం. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం సంస్కరణల పేరుతో తీసుకువచ్చిన పలు నూతన విధానాలపై ప్రజల్లో అగ్రహజ్వాలలు రగుతున్న క్రమంలో ఈ సంస్కరణ కేంద్రంపై ప్రజలకు విశ్వాసాన్ని పెంపోందిస్తుందని, దీంతో పాటు వారికి కూడా మేలు జరుగుతుందన్న నమ్మకంతో కేంద్ర ప్రభుత్వం వుందని తెలుస్తుంది.

ఓ వైపు పెద్ద కరెన్సీ నోట్ల రద్దు, జీఎస్టీ అమలులోకి వచ్చిన తరువాత, కేంద్రానికి పన్ను ఆదాయం గణనీయంగా పెరగడం, బ్యాంకు లావాదేవీల సంఖ్య పెరగడంతో వ్యక్తుల నుంచి ఆదాయపు పన్ను వసూళ్లను రద్దు చేయాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సంవత్సరం ఆగస్టు 15న ఎర్రకోటపై నుంచి ప్రసంగించే వేళ, ప్రధాని ఈ మేరకు ఈ కొత్త విధానంపై తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని బీజేపీ నేతలు అంటున్నారు.

నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలు బాంబుల్లా పేలి, మోదీపై ప్రజా వ్యతిరేకతను పెంచగా, దాన్ని తగ్గించకుంటే, గెలుపు క్లిష్టతరమవుతుందన్న ఆలోచనలో సునామీ తరహాలో సానుకూల పవనాలు వీచేందుకు ఏం చేయాలని ఆలోచించిన కమలనాథులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు సమాచారం. దేశ ప్రజలను సంతోషంలో ముంచడానికి సిద్ధమవుతున్న మోదీ, ఆదాయపు పన్నును రద్దు చేస్తే, గెలుపు సులువవుతుందని నమ్ముతున్నట్టు తెలుస్తోంది. ప్రతి ఏటా బడ్జెట్ ను ప్రవేశపెట్టే వేళ, ఆదాయపు పన్ను స్లాబులను పెంపుపై దేశ ప్రజలు అతృతగా ఎదురుచూస్తారన్న విషయం తెలిసి.. ఇక ఆదాయ పన్ను విధానాన్ని రద్దు చేయాలని నిర్ణయానికి బీజేపి సర్కార్ వచ్చినట్లు సమాచారం,

దీంతో ఊహించని రీతిలో సానుకూల పవనాలు వీస్తాయన్నది బీజేపి నేతల ఆలోచన. వాస్తవానికి ఈ ప్రతిపాదన ఈనాటిది కాదు. పెద్ద నోట్లను రద్దు చేసిన వేళే వచ్చింది. నోట్ల రద్దుతో వ్యవస్థ బాగుపడుతుందని ప్రతిపాదించిన 'అర్థగ్రంధి' సంస్థ అదే సమయంలోనే ఆదాయపు పన్ను రద్దు అంశాన్నీ ప్రతిపాదించింది. నగదు రహిత సమాజం విస్తరిస్తే, ఆదాయ పన్ను వసూలు అవసరం లేదని పేర్కొంది. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి గతంలోనే ఆదాయపు పన్ను రద్దును కోరారు.

ఇక ఆదాయపు పన్నును రద్దు చేసిన పక్షంలో కేంద్ర ఖజానాకు ఏర్పడే నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి మరో ప్లాన్ ను కూడా మోదీ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. అదే బీటీటీ (బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ టాక్స్). అంటే, ప్రతి బ్యాంకు లావాదేవీపైనా పన్ను ఉంటుంది. డబ్బు వేసినా, తీసినా, ఆన్ లైన్ లో ఖర్చు చేసినా, కార్డు గీకినా కొంత మొత్తం కేంద్ర ఖజానాకు చేరిపోతుంది. బీటీటీని పక్కనపెడితే, ఆదాయపు పన్ను రద్దు నిర్ణయాన్ని మోదీ తీసుకుంటే, ఆయన తీసుకున్న అత్యంత సంచలన నిర్ణయం ఇదే అవుతుందనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో ఆగస్టు 15న ప్రధాని నోటి వెంట పన్ను రద్దు మాటలు వస్తాయా? రావా? అన్నది వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles