pawan kalyan slams chandrababu on development ఐదేళ్లు అవకాశమిస్తే మళ్లీ కావాలి అనేలా పాలన: పవన్

Give one chance u will give repeated chancesg pawan kalyan

pawan kalyan one chance, pawan kalyan true benefits to people, janasena betterment of people, pawan kalyan, CM candidate, janasena, rama krishna, uttarandhra porata yatra, chandrababu naidu, capital region, Pawan Kalyan bus Yatra, pawan kalyan porata yatra, pawan kalyan press meet, pawan kalyan srikakulam yatra, pawan kalyan ichhapuram yatra, Pawan Kalyan uttatandhra yatra, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan Fires on CM Chandrababu at S.Kota of Vizianagaram, where he conducted a Public Meeting as a part of uttarandhra porata yatra critisizing that govt is confined to development to only one region.

ITEMVIDEOS: ఐదేళ్లు అవకాశమిస్తే మళ్లీ కావాలి అనేలా పాలన: పవన్

Posted: 07/02/2018 06:07 PM IST
Give one chance u will give repeated chancesg pawan kalyan

ఐదేళ్లు పాలించే అవకాశం ఇస్తే.. మళ్లీ మళ్లీ మీరే కావాలి, మీరే రావాలి అన్నట్లుగా రాష్ట్ర రూపురేఖల్ని మారుస్తానని జనసేన పార్టీ అధినేత, సినీనటుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు. విజయనగరం జిల్లాలోని ఎస్ కోటలో తన మలి విడత ఉత్తరాంధ్ర పోరాట యాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం కేవలం ఒక ప్రాంతం అభివృద్దికే పరిమితం అయ్యిందని, దానిని ప్రశ్నిస్తే తాను ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగోడుతున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించడం విడ్డూరంగా వుందని విమర్శించారు.

ఉత్తరాంధ్ర ప్రాంతంలో గడిచిన 35 ఏళ్లలో 30 ఏళ్లు టీడీపీ పాలనే కొనసాగిందని, అయినా ఈ ప్రాంత అభివృద్దిలో మాత్రం మార్పులు కానరాడం లేదని పవన్ కల్యాన్ దుయ్యబట్టారు. ఉత్తరాంధ్ర యువత ఉద్యోగాల  కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుందని అయినా వారికి సరైనా ఉద్యోగాలు లేవని, అన్నింటిలో ఔట్ సోర్సింగ్ విధానాన్ని అమలుచేసి.. భద్రత లేని భవిష్యత్తులో యువత చాలీచాలని జీతాలతో కొట్టుమిట్టాడుతున్నారని అవేదన వ్యక్తం చేశారు. బాబు వస్తే జాబు వస్తుందని యువత ఓట్లను కొట్టగొట్టిన చంద్రబాబు.. తన కొడుక్కి ఉద్యోగం ఇప్పించుకున్నాడే తప్ప.. ఉత్తరాంధ్ర నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు రాలేదని మండిపడ్డారు.

తాత్కాలిక ప్రాజెక్టు పట్టీసీమ నిర్మాణానికి ప్రభుత్వం వద్ద నిధులు పుష్కలంగా వుంటాయి. అదే ఉత్తరాంధ్రలో భగత్ సింగ్ కాలువ నిర్మాణాకి మాత్రం నిధులు లేవు. పట్టిసీమను యుద్ద ప్రాతిపదికన మూడేళ్లలో నిర్మించి జాతికి అంకితం చేసి.. నదుల అనుసంధానమని చెప్పే ముఖ్యమంత్రి.. ఉత్తరాంధ్ర అభివృద్దిని ఎందుకు నిర్లక్ష్యం చేశారని, ఏళ్లు గడుస్తున్నా ఇక్కడ ఎక్కడి వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఎందుకు మారిందని ప్రశ్నించారు, తమ సభలకు యువత పెద్ద సంఖ్యలో రావడం చూసి ప్రభుత్వం వారికి దిగిపోయే ముందు భృతి కల్పిస్తామని చెబుతుందని, అయితే నిరుద్యోగ యువత మాత్రం భృతి వద్దు.. ఉద్యోగమే ముద్దు అంటున్నారని జనసేనాని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles