Actress Nilani granted conditional bail నటికి కండిషనల్ బెయిల్.. విడుదల

Tv actress nilani granted conditional bail

Tamil TV Shows, Nilani, TV actress, Thoothukudi, Saidapet court, police, conditional bail, social media, viral video, chennai, tamil nadu

TV Actress Nilani has been given conditional bail based on the plea filed by her. She was arrested for putting up a controversial video on social media. In this video, she lashed out at the police for carrying out ‘brutal’ acts on anti-Sterlite protesters in Tuticorin.

నటికి షరుతులతో కూడిన బెయిల్.. విడుదల

Posted: 06/29/2018 12:43 PM IST
Tv actress nilani granted conditional bail

తమిళనాడులోని తూత్తుకుడి ఘటనపై అన్ని వర్గాలు వారు స్పందించారు. కొందరు తమ మనోభావాలను అపుకోలేక.. వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు నేతలు, సెలబ్రిటీలపై పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. అయితే తూత్తుకుడి ఘటనపై స్పందించిన ప్రముఖ టీవీ నటి నిలానీ సామాజిక ప్రసార మాధ్యమాల్లో విమర్శలు, వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో అమెపై పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా, న్యాయస్థానం అమెకు రిమాండ్ విధించింది. కాగా, పది రోజుల తరువాత అమెకు కోర్టు షరతులతో కూడిన బెయిలు మంజూరైంది.

దీంతో పది రోజుల జైలువాసం గడిపిన నిలాని త్వరలో విడుదల కానుంది. ఇక వివరాల్లోకి వెళ్తే..  మే 22న తూత్తుకుడిలో స్టెరిలైట్‌ కర్మాగార వ్యతిరేక ఆందోళనలో పోలీసులు కాల్పులు జరిపారు. ఆ రోజు నటి నిలానీ ఓ తమిళ సీరియల్‌లో లేడీ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ పాత్రలో నటించారు. ఆ సందర్భంగా ఆమె తూత్తుకుడిలో జరిగిన పోలీసు కాల్పులుపై స్పందిస్తూ ఓ వీడియో తీసి వాట్సప్‌, ఫేస్‌బుక్‌లో ప్రసారం చేశారు. పోలీసు దుస్తులతో నటించినందుకు సిగ్గుపడుతున్నానని, తూత్తుకుడిలో పోలీసులు మారణకాండ నిర్వహించారని విమర్శించారు.

అమె వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ కావడంతో.. స్పందించిన పోలీసులు అమెపై కేసు నమోదు చేశారు. పోలీసు కేసు నేపథ్యంలో కొన్ని రోజులపాటు అజ్ఞాతంలోకి వెళ్లిన నటిని చివరకు ఈ నెల 19న కున్నూరులో ఉన్నట్లు తెలుసుకుని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో సైదాపేట కోర్టులో ఆమె బెయిలు కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. మేజిస్ట్రేట్‌ అంకాళేశ్వరి నటి నిలానీకి షరతులతో కూడిన బెయిలు మంజూరు చేశారు. చెన్నైని విడిచి ఎక్కడికీ వెళ్లకూడదని, పోలీసులు పిలిచినప్పుడల్లా విచారణకు హాజరుకావాలనే నిబంధనలతో ఇద్దరి పూచీకత్తులతో ఆమెకు బెయిలిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamil TV Shows  Nilani  TV actress  Thoothukudi  Saidapet court  social media  tamil nadu  

Other Articles