left parties to tie-up with Janasena in 2019 elections జనసేనతోనే వామపక్షాలు.. కీలక ప్రకటన..

Left parties tie up with pawan kalyan s janasena in forth coming elections

pawan kalyan, janasena, Pawan Kalyan left parties, pawan kalyan RamaKrishna, pawan kalyan madhu, pawan kalyan cpi, pawan kalyan cpm, pawan kalyan, janasena, ramakrishna, madhu, cpi, cpm, elections, andhra pradesh, politics

Left parties CPI and CPM to tie up with Jana Sena party in the forth comming assembly elections, the decision is announced by CPI state secretary RamaKrishna after holding a meet with pawan kalyan.

జనసేనతోనే వామపక్షాలు.. కీలక ప్రకటన..

Posted: 06/26/2018 04:53 PM IST
Left parties tie up with pawan kalyan s janasena in forth coming elections

రానున్న సార్వత్రిక ఎన్నికలతో పాటు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో తమ బాట ఎటువైపు అన్నది వామపక్ష పార్టీలు ఇవాళ స్పష్టం చేశాయి. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కీలక ప్రకటనను ఇవాళ వెలువరించాయి. వచ్చే ఎన్నికలలో జనసేన పార్టీతో కలసి ముందుకు నడుస్తామని వామపక్షాలు నిర్ణయం తీసుకున్నాయి. రాష్ట్రంలో తమకు ఉనికి వున్నా.. ఆ ఉనికిని అసెంబ్లీలో సీట్ల వరకు తీసుకెళ్లలేకపోయిన అరుణదళం.. ఇకపై జనసేనతో కలసి ముందుకెళ్లి.. తమ పూర్వవైభవాన్ని పోందాలని అకాంక్షిస్తుంది.

ఈ మేరకు జనసేనాని పవన్ కల్యాణ్ తో భేటీ అయిన తరువాత సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మీడియాతో మట్లాడుతూ.. రానున్న ఎన్నికలతో తాము జనసేన పార్టీతో పొత్తుపెట్టుకుంటామని ప్రకటించారు. పవన్ కల్యాన్ తో చర్చించిన అనంతరమే తాము ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలలో తాము పవన్ కల్యాన్ పార్టీతో కలసి పోటీ చేస్తామని ప్రకటించారు. అధికారమే పరమావధిగా వున్న పార్టీలను పక్కనబెట్టితే.. రాజకీయాలలో సమూల మార్పులు, సామాజిక బాధ్యత, జవాబుదారి ప్రభుత్వం తీసుకురావాలన్న పవన్ తోను తాము జట్టుకడతామని ఆయన స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  ramakrishna  madhu  cpi  cpm  elections  andhra pradesh  politics  

Other Articles