may not be able to port your mobile soon మోబైల్ పోర్టబులిటీ.., ఇక కనిపించదా.?

Mobile number portability to stop working from next year reports

telecom companies, mobile portability, MNP, Interconnection Telecom Solutions and Syniverse Technologies, trai, technology news, Tech Video, tech news, Latest Gadgets News, Gadgets Review, Gadgets, best gadgets

Mobile phone users looking to switch carriers with Mobile number portability (MNP), while retaining their numbers could face difficulties after March next year.

మోబైల్ పోర్టబులిటీ.., ఇక కనిపించదా.?

Posted: 06/26/2018 04:08 PM IST
Mobile number portability to stop working from next year reports

సిగ్నల్స్ సరిగా లేక పోయినా… ఆయా సంస్థలు అందించే సర్వీలు నచ్చకపోయినా… గత కొన్నేళ్లుగా చటుక్కున వేరే టెలికాం సంస్థలకు మారే వారు. అంతేకాదు చక్కని ఆఫర్లు ప్రకటించిన టెలికాం సంస్థలకు చటుక్కున మారేవాళ్లు. ఇప్పటికీ మారుతున్నారు. నెంబరులో మార్పు లేకుండా నంబర్ పోర్టబులిటీ ద్వారా ఒక నెట్ వర్క్ నుంచి మరో నెట్ వర్క్ కు కేవలం సర్వీసు ప్రోవైడర్లు మారడంతో చటుక్కున మారుతున్నారు వినియోగదారులు. అయితే ఇకపై మాత్రం ఈ సదుపాయం అందుబాటుపై చెక్ పడనుందని అంటున్నాయి టెలికాం సంస్థలు.

మొబైల్ నంబర్ పోర్టబులిటీ సేవలను నిలిపివేసేందుకు చర్యలు చేపట్టనున్నాయి ఇంటర్ కనెక్షన్ టెలికాం సొల్యూషన్స్, సినివెర్స్ టెక్నాలజీస్ సంస్థలు. మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ సేవలను 2019 మార్చి నుంచి నిలిపివేయనున్నాయని ఓ పత్రిక రిపోర్టు చేసింది. ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ ఫీజులను ట్రాయ్‌ 19 రూపాయల నుంచి 4 రూపాయల వరకు తగ్గించింది. అప్పటి నుంచి తాము నష్టాలను చవిచూస్తున్నామని వచ్చే ఏడాది నుంచి మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ సేవలు నిలిపివేస్తామని తెలిపాయి.

ఒకవేళ ఈ కంపెనీలు అన్నట్టుగానే సర్వీసులను నిలిపివేస్తే… వినియోగదారులు ఇతర నెట్‌వర్క్‌లకు మారడం ఇక అంత సులువు కాదు. వినియోగదారులకు రక్షణ కల్పించేందుకు.. కంపెనీలు నాణ్యమైన సేవలు అందించేలా ప్రభుత్వం మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ విధానాన్ని ప్రవేశపెట్టింది. జియో రాకతో రిలయన్స్ కమ్యూనికేషన్స్, టాటా టెలీసర్వీసెస్, ఎయిర్‌సెల్, టెలీనార్ ఇండియా తదితర కంపెనీలు మూతపడ్డాయి. ఒక్క మార్చి నెలలో మొబైల్‌ నెంబర్‌ పోర్టబులిటీ అభ్యర్థనలు 19.67 మిలియన్లకు పెరిగాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telecom companies  mobile portability  MNP  Interconnection Telecom Solutions  trai  

Other Articles