వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో వుండాలని కొందరు రాజకీయ నాయకులు అప్రస్తుతమైన విషయాలను కూడా హాట్ టాపిక్ గా మార్చేస్తారు. అలాంటి కోవకు చెందిన వ్యక్తే ఉత్తర్ ప్రదేశ్ బీజేపి ఎమ్మెల్యే సురేంద్ర సింగ్. ఉన్నావ్ అత్యాచార కేసులో దళిత బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెనగర్ ను మద్దతుగా వ్యాఖ్యలు చేసి.. అసలు రోడ్లపై అమ్మాయిలకు ఏం పని అంటూ.. మహిళా లోకం అగ్రహాన్ని చవిచూసిన ఈ బైరా ఎమ్మెల్యే.. తాజాగా చారిత్రక కట్టడాల పేర్లపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఉత్తర్ ప్రదేశ్ లోని అగ్రాలో ప్రపంచ వింతగా గుర్తించబడిని తాజ్ మహల్ పై ఆయన చేసిన వ్యాఖ్యాలు దుమారం రేపుతోంది. ‘మొఘలుల పాలనా కాలం ముగిసిపోయిన తర్వాత వారి పేర్ల మీద ఉన్న రోడ్ల పేర్లు, చారిత్రక కట్టడాల పేర్లను ఎందుకు కోనసాగిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇక ఆ పేర్లను యధావిధంగా కొనసాగించడం మానేసి.. వాటికి పేర్లను మార్చాలని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా తాజ్ మహల్ పేరును రామ్ మహల్, లేదా కృష్ణ మహల్ లేదా శివాజీ మహల్ గా నామకరణం చేయాలి’ అంటూ సురేంద్ర సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఇక పనిలో పనిగా విక్టోరియా మోమొరియల్ పేరును కూడా జానకీ మహల్ అని మార్చాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొఘలులు నిర్మించిన కట్టడాలను కూల్చడానికి వీలులేదన్నారు. ఎందుకంటే అవి భారత గడ్డపై నిర్మించినవి. దీనికి బదులుగా వాటి పేర్లు మార్చాలి. నాకు వీటి పేర్లు మార్చే అవకాశం ఇస్తే తాజ్ మహల్ కు ‘రాష్ట్ర భక్తి మహల్’ అని నామకరణం చేస్తాను అని అన్నారు. ఇక మొఘలులు కట్టిన ఏదైనా ఒక కట్టడానికి డా. ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెట్టి చూడండి. ఆ అనుభూతి చాలా అద్భుతంగా ఉంటుంది’ అంటూ వ్యాఖ్యానించారు.
(And get your daily news straight to your inbox)
May 17 | హర్యాణలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. ఉదయం వేళ నడుస్తూ వెళ్తున్న ఓ కష్టజీవి గొంతు నులిమి నడిరోడ్డుపై దోపిడీకి పాల్పడ్డారు. హర్యానాలోని గురుగ్రామ్ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ... Read more
May 17 | కృష్ణా, రామా అని భగవంతుడి నామ జపం చేయాల్సిన వయస్సులోనూ ఓ వృద్దుడు తన మనవరాలి వయస్సులోని మైనర్ బాలికను లైంగికంగా వేధించాడు. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. అయితే ఇలాంటి... Read more
May 17 | ఏమి జరిగినా మన మంచికే అన్న సూక్తిని పాటిస్తూ.. ధైర్యంగా ముందుకు నడిస్తే.. అపజయాలే విజయశిఖారాలుగా మారుతాయన్నది పెద్దల మాట. అందుకనే ధైర్యే సాహసే లక్ష్మీ అనే మాట కూడా పుట్టింది. ఈ సూక్తి... Read more
May 17 | కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి చిందంబరం తనయుడు కార్తీ చిదంబరం నివాసంలో సెంట్రోల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబిఐ) మంగళవారం సోదాలు నిర్వహిస్తున్నది. కార్తీ చిదంబరం నివాసాలతో పాటు దేశవ్యాప్తంగా కార్యాయాలయాల్లో సోదాలు... Read more
May 17 | షరియా చట్టం అమలుజరిగే ఇస్తామిక్ దేశాల్లో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో.. అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఇరాక్, ఇరాన్, సౌదీ అరేబియా వంటి దేశాల్లో అమలుపర్చే బహిరంగ శిక్షలు పలు సామాజిక మాద్యమాల్లోనూ... Read more