Petrol prices fall for tenth straight day వరుసగా పదవ రోజు తగ్గిన ఇంధన ధరలు..

Petrol price today fuel rates slashed for 9th consecutive day

oil price, crude oil, price hike, petrol, diesel, dharmendra pradhan, goods and service tax, petrol price, diesel price, Iran, excise, VAT, Opec, Venezuela

Fuel prices fell for the tenth day today as Indian Oil reduced prices of petrol by 21 paise to Rs 77.42 and diesel by 15 paise to Rs 68.58 in Delhi. Petrol now costs Rs 85.24 and diesel Rs 73.02 a litre in Mumbai.

వాహనదారులకు కాసింత ఊరటనిచ్చిన చమురు కంపెనీలు

Posted: 06/08/2018 11:35 AM IST
Petrol price today fuel rates slashed for 9th consecutive day

కర్ణాటక ఎన్నికల తరువాత వరుసగా 16 రోజుల పాటు పెరుగుతూ పోయిన ఇంధన ధరలు గత నెల 30 నుంచి తగ్గముఖం పడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ వాహనదారులకు ఊరట కలిగించేలా పెట్రోల్ ధరలు ఇరవై పైసల మేర తగ్గాయి. వరుసగా పదో రోజు తగ్గిన ఇంధన ధరలు కాసింత ఊరట కలిగిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు క్షీణించడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రోజుకు కొంత చొప్పున తగ్గిస్తూ వస్తున్నాయి.

చమురు కంపెనీలు పెంచేటప్పుడు రెండంకెల స్థాయిలో ఉంటే, తగ్గించేప్పుడు మాత్రం పైసా నుంచి ధరలు తగ్గడంపై విమర్శలను ఎదుర్కోన్న ఆయిల్ కంపెనీలు ఇవాళ వాహనదారులకు కాస్త ఊరటనిచ్చేలా ధరలను తగ్గించాయి. తాజాగా ఇవాళ్టి తగ్గింపు లీటరు పెట్రోల్ పై 21 పైసలు, లీటరు డీజిల్ పై 15 పైసలు మేర తగ్గించడం జరిగింది. దేశవ్యాప్తంగా రవాణా దూరాన్ని బట్టి, పన్నులను బట్టి పెట్రోల్, డీజిల్ ధరల్లో వ్యత్యాసాలుంటాయని తెలిసిందే. కనుక పన్నుల భారం కూడా పరిశీలిస్తే  తగ్గింపు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటుంది.

హైదరాబాద్ మార్కెట్లో డీజిల్ 17 పైసలు తగ్గి ఈ రోజు రూ.74.54గా ఉంది. పెట్రోల్ 22 పైసలు తగ్గి రూ.82.01గా ఉంది. వైజాగ్ సిటీలో పెట్రోల్ 21 పైసలు తగ్గి రూ.82.76గా ఉండగా, డీజిల్ 16 పైసలు తగ్గి రూ.75.01గా ఉంది. గుంటూరులో డీజిల్ 16 పైసలు తగ్గుదలతో రూ.75.86, పెట్రోల్ 22 పైసలు తగ్గి రూ.83.62గా ఉంది. ఢిల్లీలో 21 పైసలు తగ్గి పెట్రోల్ లీటర్ రూ.77.42గా, డీజిల్ 15 పైసలు తగ్గి రూ.68.58గా ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : oil price  crude oil  price hike  petrol  diesel  dharmendra pradhan  goods and service tax  

Other Articles