Amit Shah cannot change Sena's stand: Sanjay Raut పార్టీ తీర్మాణానికే కట్టుబడే ఒంటరిగా బరిలోకి: శివసేన

Shiv sena snubs amit shah s outreach will contest 2019 lok sabha elections alone

Amit Shah, BJP, Shiv Sena, Uddhav Thackeray, Amit Shah meets Uddhav Thackeray, Matoshree, Sanjay Raut, Devendra Fadnavis, Maharashtra government, NDA government, maharastra, politics

A day after the meeting between Amit Shah and Uddhav Thackeray, the Shiv Sena has made it clear that there is no shift in its stance and that it will stick to its resolution to contest elections on its own.

పార్టీ తీర్మాణానికే కట్టుబడే ఒంటరిగా బరిలోకి: శివసేన

Posted: 06/07/2018 06:19 PM IST
Shiv sena snubs amit shah s outreach will contest 2019 lok sabha elections alone

2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓ వైపు ఇన్నాళ్లు దూరంగా వుంచిన పార్టీ సీనియర్ నేతలను ఓ వైపు దగ్గరకు చేర్చకుంటూ.. వారే ఇక పార్టీని ముందుకు నడిపించాలని అభ్యర్థిస్తున్న బీజేపి అధిష్టానం.. వారి సహకారంతో రానున్న సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించేందుకు ప్రణాళికలు రచిస్తుంది. ఇందుకోసం 70 ఏళ్లు పైబడిన వ్యక్తులను ఎన్నికల బరిలో నుంచి తప్పించాలని తీసుకున్న నిర్ణయాలను కూడా పక్కనబెట్టి ఇక వారు లేకపోతే గత్యంతరమే లేదని గ్రహించింది.

ఇక మరోవైపు మిత్రులను కూడా దరిచేర్చుకుంటుంది. నాలుగేళ్లల్లో ఎన్నడూ లేని విధంగా బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తొలిసారిగా శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాకరే వద్దకు వచ్చి భేటీ అయ్యి రానున్న ఎన్నికలలో ఎలా బరిలోకి దిగాలన్న విషయమై రెండు గంటల పాటు చర్చించారు. అయితే శివసేన మాత్రం అందుకు భిన్నంగా ప్రకటనను వెలువరించింది. రానున్న సార్వత్రిక ఎన్నికలలో తాము ఒంటరిగా పోటీ చేయాలనే నిర్ణయంలో ఎలాంటి మార్పూ లేదని శివసేన మరోసారి స్పష్టంచేసింది.

ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్‌ రౌత్‌ ఈ విషయం స్పష్టంచేశారు. వచ్చే అన్ని ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలనే తీర్మానానికే తమ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టంచేశారు. అమిత్‌ షా, ఉద్ధవ్‌ ఠాక్రే భేటీపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇద్దరి మధ్యా రెండు గంటలపాటు చర్చలు సాఫీగా సాగాయి. అనేక విషయాలపై వారిద్దరూ చర్చించారు. అమిత్‌ షా ఎజెండా ఏమిటో మీడియాకు తెలుసు. శివసేన ఓ తీర్మానం చేసుకుంది. వచ్చే అన్ని ఎన్నికల్లోనూ ఒంటరిగా పోటీ చేయాలని. మా పార్టీ తీర్మానంలో ఎలాంటి మార్పూ ఉండదు’’ అని వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amit Shah  BJP  Shiv Sena  Uddhav Thackeray  Sanjay Raut  Maharastra  politics  

Other Articles