Woman Tossing Baby Girl Into The Street మాతృ ప్రేమకు పరాకాష్ట: పేగు బంధమా.. వీధి మెట్లే నీకు చిరునామా..

Woman tossing baby girl into the street from car window in muzaffarnagar

UP, Woman, Infant, Woman Throws New Born Out Of Car, Muzaffarnagar, CCTV Footage, viral video, social media, uttar pradesh

An unidentified woman drops a new-born baby on a street from a car in Muzaffarnagar. CMO Muzaffarnagar says, "the new-born is under treatment but her condition remains critical.

మాతృ ప్రేమకు పరాకాష్ట: పేగు బంధమా.. వీధి మెట్లే నీకు చిరునామా..

Posted: 06/07/2018 01:10 PM IST
Woman tossing baby girl into the street from car window in muzaffarnagar

ఉత్తరప్రదేశ్ లో హృదయవిదారకమైన ఘటన జరిగింది. పొత్తిళ్లలో ఉండాల్సిన పసికందు.. ఓ ఇంటి ముందు పడివున్నాడు. అదెలా అంటే ఓ గుర్తుతెలియని మహిళ కనీసం మానవత్వం కూడా లేకుండా.. ఆ పసికందును బట్టల్లో చుట్టి ఓ ఇంటి ముందు మెట్లపై పడేసి వెళ్లింది. అమ్మ అన్న పదానికి, అమ్మతనం అన్న బంధానికి నీళ్లు వదిలింది. అమ్మ కాలేక ఎందరో మహిళలు కనిపించిన దేవుడికళ్లా మొక్కులు మొక్కుకుంటూ వెళ్తుంటే.. కొంచెం కూడా జాలి, దయ, కరుణ, కనికరం అన్నవి లేకుండా ఓ వీధిలోని ఇంటి గుమ్మం ముందు పసికందును వదిలి వెళ్లింది ఈ మహిళ.

ఉత్తరప్రదేశ్‌ లోని ముజఫర్‌ నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు స్థానికంగా ఏర్పాటు చేసిన సిసిటీవీ వీడియోల్లో రికార్డు కాగా, వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అవికాస్తా విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ముజఫర్ నగర్ లో నిర్మానుష్యంగా ఉన్న ఓ వీధిలో కారులో వెళ్తూ ఓ ఇంటి గుమ్మం ముందు  ఓ టవల్ లో చుట్టి ఉన్న చిన్నారి పాపను గుర్తు తెలియని మహిళ కారు కిటికీలో నుంచి కిందకు వంగి ఇంటి ఎదుట వదిలేసి అక్కడి నుంచి వెళ్లింది.

అదృష్టవశాత్తు అ పసికందు మెట్లపై వుంది కానీ అప్పుడే కాసింత పక్కకు ఒరిగినట్లు అనిపించినా.. అలా జరగలేదు.. అదే జరిగితే.. మహిళ కారు కిందే విఘతజీవి అయ్యివుండేది. చిన్నారిని ఏడుపు విని స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. అయితే చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు  జిల్లా చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ తెలిపారు. ఈ వీడియో ఇప్పుడు  సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. పసిపాపలు అన్న కనికరం కూడా లేకుండా రోడ్లపై, చెత్త కుప్పల్లో, హాస్సిటల్స్ బాత్రూంలలో చిన్నారులను వదిలివెళ్లున్న సంఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా చూస్తున్నాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles