Shabana Azmi apologises to railways for tweet రైల్వేశాఖ మంత్రికి బాలీవుడ్ నటి క్షమాపణలు

Shabana azmi issues apology on her tweet on railways

Railway ministry, Shabana Azmi railway ministry, Veteran actor Azmi troll, Veteran actor, Shabhana Azmi, Veteran actor, Azmi Shabana, railway ministry, piyush goel, Twitter, apologyvideo, Entertainment News,Bollywood News,Hindi Movies News

Veteran actor Shabana Azmi issued an apology to the railway ministry after she was corrected for posting a video that mistook people washing dishes in a puddle of water as railway workers.

రైల్వేశాఖ మంత్రికి బాలీవుడ్ నటి క్షమాపణలు

Posted: 06/07/2018 03:41 PM IST
Shabana azmi issues apology on her tweet on railways

బాలీవుడ్ నిన్నటి తరం నటి షబానా అజ్మీ కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖతో పాటు ఆ శాఖ మంత్రిని కూడా క్షమాపణలు కోరింది. తాను చేసిన పోరబాటును వివరించినందుకు ధన్యవాధాలు కూడా తెలిపింది. ఆనక తనను సరిచేసినందుకు క్షమాపణలు కోరింది. ఇంటకీ విషయం ఏంటీ అంటారా.? సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన ఓ వీడియోను చూసిన సీనియర్‌ నటి షబానా అజ్మీ.. అంతకుముందు నెట్ జనుల కామెంట్లు చూసి మోసపోయింది. తాను కూడా అదే భావనతో ఆ వీడియోను ప్రజా, ప్రయాణిక సంక్షేమం కోసం కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ మంత్రికి ఫార్వడ్ చేసింది.

రైల్వే మంత్రిత్వ శాఖ దానిపై వివరణ ఇవ్వడంతో అమె తన తప్పును తెలుసుకుని క్షమాపణలు చెప్పారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందయ్యా అంటే. ఇద్దరు వ్యక్తులు.. మురికి నీటిలో భోజనం తినే ప్లేట్లను కడుగుతున్న 30 సెకన్ల వీడియోను చూసిన షబానా.. వారిని రైల్వే సిబ్బందిగా భావించారు. తనకన్నా ముందు దానిని తనకు ట్వీట్ చేసిన వారు కూడా అలాగే భావించడంతో అమెకూడా అది రైల్వేలో జరిగిందని భావించారు. దాంతో వెంటనే ఆ వీడియోను రైల్వే మంత్రిత్వ శాఖ, మంత్రి పీయూష్‌ గోయల్‌కు ట్యాగ్‌ చేసి.. ‘ఈ వీడియోను మీరొకసారి వీక్షించాల్సిందే’ అంటూ ట్వీట్‌ చేశారు.

షబానా ట్వీట్‌కు స్పందించిన రైల్వే శాఖ.. ‘మేడమ్‌ ఈ వీడియో ఒక మలేషియన్‌ రెస్టారెంట్‌లో.. మురికి నీళ్లలో ప్లేట్లను కడుగుతున్న వర్కర్లకు సంబంధించినదంటూ’.. అందుకు సంబంధించిన వార్తా కథనాన్ని కూడా ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. వెంటనే స్పందించిన షబానా.. ‘నా క్షమాపణలు స్వీకరించండి. పొరపాటును సరిదిద్దుకున్నానంటూ’ క్షమాణలు తెలిపారు. అయితే ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కొందరు నెటిజన్లు... రైల్వే శాఖ షబానాపై పరువు నష్టం దావా వేయాలంటూ ట్రోల్‌ చేశారు. దీంతో మరోసారి ఆమె.. ‘మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నానంటూ’ ట్వీట్‌ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shabhana Azmi  Veteran actor  Azmi Shabana  railway ministry  piyush goel  Twitter  apology  

Other Articles