Petrol and diesel prices slashed in double digit paise రెండెంకల ఫైసల్లో తగ్గిన ఇంధన ధరలు..

Petrol and diesel prices slashed in double digit paise

oil price, crude oil, price hike, petrol, diesel, paise, double digit paise, dharmendra pradhan, goods and service tax, petrol price, diesel price

Fuel prices have been on a continuous reducing prices in single digit since few days, but today it has been reduced in double digit paise but the petrol prices has not come down under Rs 77 per litre in delhi.

రెండెంకల ఫైసల్లో తగ్గిన ఇంధన ధరలు..

Posted: 06/04/2018 10:26 AM IST
Petrol and diesel prices slashed in double digit paise

పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ తగ్గాయి. కర్ణాటక ఎన్నికల తరువాత మే 14 నుంచి పెరుగుతూ వచ్చిన ఇంధన ధరలు.. గత ఐదు రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. అయితే పెంచేప్పుడు ఏకంగా నాలుగైదు రోజుల్లో రూపాయల మేర పెంచుతున్న ఇంధన సంస్థలు.. తగ్గించేప్పడు మాత్రం ఏకంగా పైసల్లో తగ్గిస్తున్నారు. అయితే గత ఐదు రోజులుగా తగ్గిన ఇంధన ధరలతో వాహనదారులకు వచ్చిన లాభం మాత్రం శూన్యమనే చెప్పాలి. పైస్సల్లో తగ్గిస్తున్న ఇంధన ధరల సంగతి ఎలావున్నా.. చిల్లర సమస్యతో రౌండ్ ఫిగర్ చూపించి తగ్గిన మొత్తాన్ని డీలర్లు బాదేస్తున్నారు.

అయితే ఇవాళ మాత్రం ఇంధన ధరలు డబుల్ డిజిట్ లో తగ్గాయి. అంటే ఫైసల్లోనే డబుల్ డిజిట్. ఆల్ టైం హై రికార్డ్ దిశగా దూసుకెళ్లిన ఇంధన ధరలను ఇంధన సంస్థలు ప్రస్తుతం వాహనదారులకు స్వల్ప ఊరటనిచ్చాయి.  పెట్రోల్‌పై 15 పైసలు, డీజిల్‌పై 14 పైసలను తగ్గించినట్లు చమురు కంపెనీలు ప్రకటించాయి. మే 30 నుంచి తగ్గుముఖం పడుతున్న ఇంధన ధరలు ఇప్పటి వరకు లీటరు పెట్రోల్‌ పై 46పైసలు, లీటరు డీజిల్పై 33 పైసలు తగ్గించాయి ఇంధన సంస్థలు. గత మూడు రోజుల నుంచి ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి.

అయితే అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు గణనీయంగా తగ్గుతున్నా.. ఆ ధరలతో పోల్చుకుంటే మాత్రం ఇంధన ధరలు తగ్గడం లేదన్న వాదన వాహనదారుల నుంచి వినిపిస్తుంది. ఇప్పటికే కేంద్ర మాజీ అర్థిక శాఖ మంత్రి చిదంబరం ఇంధన ధరలను ఏకంగా 25 రూపాయల మేర తగ్గించవచ్చని.. వాహనదారులను కేంద్రం లూటీ చేస్తుందని కూడా అరోపించారు. ప్రస్తుత ధరల ప్రకారం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.77.16, డీజిల్ రూ.68.97గా నమోదైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles