Sushma Swaraj's plane 'goes missing' for 14 minutes సుష్మా స్వరాజ్ అభిమానుల కలవరం దూరం..

Jet carrying sushma swaraj briefly loses touch with atc

sushma Swaraj, Meghdoot, South Africa, plane missing, Embraer 135, air traffic control, Trivandrum, Mauritius, BRICS, brics summit 2018

External Affairs Minister Sushma Swaraj's plane went off radar for 14 minutes causing panic among the authorities. Sources from the ATC told that the flight couldn't contact the Male ATC after which the Mauritian air traffic control declared an emergency alert.

సుష్మా స్వరాజ్ అభిమానుల కలవరం దూరం..

Posted: 06/04/2018 09:45 AM IST
Jet carrying sushma swaraj briefly loses touch with atc

యావత్ దేశ ప్రజలతో పాటు విదేశీయుల అభిమానాన్ని కూడా చూరగొన్న బీజేపి సీనియర్ నాయకురాలు.. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రయాణిస్తున్న విమానం పద్నాలుగు నిమిషాల పాటు జాడ లేకుండా పోయిందన్న వార్తతో ఒక్కసారిగా భారతీయు ప్రజలను కలవరానికి గురిచేసింది. దీంతో.. కేంద్ర విమానాయాన శాఖ అధికారులు కూడా తీవ్ర ఆందోళన చెందారు.  రైల్వే శాఖ మంత్రిగా నూతన సంస్కరణలకు తెరతీసిన సురేష్ ప్రభు నేతృత్వం వహిస్తున్న కేంద్ర విమానయాన శాఖ పగ్గాలు చేపట్టిన అనంతరం.. ఈ ఘటన చోటుచేసుకోవడంతో అందరిలోనూ తీవ్ర అందోళన మొదలైంది.

బ్రిక్స్ దేశాల సదస్సులో పాల్గొనేందుకు త్రివేండ్రం నుంచి మారిషస్ మీదుగా సుష్మ స్వరాజ్ దక్షిణాఫ్రికాకు ప్రయాణమయ్యారు. సాయంత్రం 4 గంటలకు త్రివేండ్రం విమానాశ్రయంలో ఆమె ప్రయాణిస్తున్న మేఘదూత్‌ విమానం టేకాఫ్ అయ్యింది. త్రివేండ్రం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) పరిధి నుంచి మారిషస్ ఏటీసీ కంట్రోల్‌లోకి సుష్మ విమానం ప్రవేశించిన తర్వాత 12 నుంచి 14 నిమిషాల పాటు ఈ రెండు ఏటీసీలతో పైలెట్లు కాంటాక్ట్‌లోకి రాలేదు. ఎంతకు విమానం జాడ తెలియరాకపోవడంతో.. మారిషస్ ఏటీసీ అధికారులు ఎమర్జెన్సీ అలారాన్ని మోగించారు.

తమ దేశ వైమానిక దళాన్ని అప్రమత్తం చేశారు. అయితే సాయంత్రం 4.44 గంటలకు సుష్మా స్వరాజ్ విమానం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో అనుసంధానం అయ్యింది. దీంతో విమానయాన శాఖ అధికారులతో పాటు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సముద్ర పరివాహక ప్రాంతాల మీదుగా ప్రయాణించేటప్పుడు రాడార్ కవరేజ్ ఉండదు. సముద్రంలో ద్వీప సమూహంతో ఉన్న మారిషస్ ఏటీసీ కంట్రోల్‌‌ పరిధిలో గతంలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగినట్లు సీనియర్ అధికారి ఒకరు అన్నారు. అయితే సుష్మాస్వరాజ్ విమానం ఏటీసీతో అనుసంధనం కావడం అమె అభిమానుల కలవరాన్ని దూరం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles