all eyes on karnataka assembly in lieu of floor test అందరి చూపులు కర్ణాటక అసెంబ్లీ పైనే.. క్షణక్షణం ఉత్కంఠ

All eyes on karnataka assembly in lieu of floor test

supreme court, K.G bopaiah, Vajubhai Vala, B.S. Yeddyurappa, BJP, Congress, JD(S), karnataka assembly, pro tem speaker, mukhul rothagni, kapil sibal, assembly speaker, speaker election, congress mlas, jds mlas, BS Yeddyurappa, Siddaramaiah, governor, vajubhai wala, Congress, BJP, JDS, Kumara Swamy, hyderabad, kochi, PM Modi, Amit shah, karnataka, politics

The swearing-in has begun in the karnataka Vidhana Soudha. Former chief minister Siddaramaiah and recently sworn in chief minister BS Yeddyurappa have taken the oath of office.

అందరి చూపులు కర్ణాటక అసెంబ్లీ పైనే.. క్షణక్షణం ఉత్కంఠ

Posted: 05/19/2018 11:58 AM IST
All eyes on karnataka assembly in lieu of floor test

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బొపయ్యనే ప్రోటెం స్పీకర్ గా కొనసాగించి.. అతని అధ్వర్యంలోనే బలనిరూపణ చేయాల్సిందిగా అదేశాలు జారీ చేసిన నేపథ్యంలో.. కర్ణాటక రాజధాని బెంగుళూరులోని విధాన సౌధాలో అసెంబ్లీ సమావేశం ప్రారంభయైంది. సరిగ్గా పదకొండు గంటలకు వందేమాతర గీతంలో అసెంబ్లీ సమావేశాలను స్పీకర్ బోపయ్య ప్రారంభించారు. అనంతరం ప్రోటెం స్పీకర్ కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులతో అసెంబ్లీలో ప్రమాణ స్వీకరాం చేయించారు.

ఈ క్రమంలో కొత్తగా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన బీఎస్ యడ్యూరప్పతో పాటు తాజా మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో కూడా ఆయన ప్రమాణస్వీకరాం చేయించారు. అంతకుముందు, ప్రొటెం స్పీకర్ బోపయ్య అసెంబ్లీలోకి ప్రవేశించిన అనంతరం, సీఎం యడ్యూరప్ప, మాజీ సీఎం సిద్ధరామయ్య సహా ఎమ్మెల్యేలందరూ లోపలికి ప్రవేశించారు. అనంతరం ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్రక్యమం కొనసాగింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన బీజేపీ నేత యడ్యూరప్ప సుప్రీంకోర్టు అదేశాల నేపథ్యంలో ఇవాళ శాసనసభలో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది.

అంతా అసెంబ్లీలో సమావేశమైనా.. యడ్యూరప్ప ప్రభుత్వం మనగలుగుతుందా..? లేక కాంగ్రెస్ జేడీఎస్ కూటమి ప్రభుత్వాన్ని చేపడుతుందా.? అన్న ఉత్కంఠ దేశప్రజలందరిలో వుంది. దీంతో ఎలాంటి ఫలితం రానుందో అనే దానిపై సర్వత్రా ఉత్కంఘ నెలకొంది. అయితే తాజాగా దేశసర్వోన్నత న్యాయస్థానం జారి చేసిన అదేశాల ప్రకారం.. బలనిరూపణ ముజువాణి పద్దతిలోనే జరగనుందా..? లేక బీజేపి మరే ప్రత్యామ్నాయం అలోచించిందన్న దానిపై కూడా ఆసక్తి నెలకొంది.  రోవైపు బలపరీక్ష ఘట్టాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసానం ఆదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : supreme court  K.G bopaiah  Yeddyurappa  Siddaramaiah  BJP  Congress  JD(S)  karnataka  politics  

Other Articles