Rain, hailstorm lash Hyderabad హైదరాబాద్ లో మిట్టమధ్యాహ్నం చిమ్మచీకట్లు..

Rain hailstorm lash hyderabad

Indian Meteorological Department, summer sun, scorching heat, heat wave, thunderstorms, gusty winds, hyderabad, telangana

Rain accompanied by gusty winds and hailstorm on Thursday lashed parts of Telangana including the state capital Hyderabad. Heavy rainfall has left areas flooded with water such as Banjara Hills, Ram Nagar, OU, Secunderabad.

ITEMVIDEOS: హైదరాబాద్ లో మిట్టమధ్యాహ్నం చిమ్మచీకట్లు..

Posted: 05/17/2018 04:37 PM IST
Rain hailstorm lash hyderabad

హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మండుతున్న భానుడు తన ప్రతాపాన్ని చల్లార్చగా, వరణుడికి తోడు వాయువు కూడా తోడై క్షణాల్లో చీకట్లు కమ్మేసి.. గాలి, వాన దుమారం సృష్టించాయి. విపరీతమైన వేడిమితో ఉపరితల అవర్తన ద్రోణి ప్రభావంతో క్యూములోనింబస్ మేఘాటు ఏర్పడి హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాలను కూడా కమ్మేసింది. నిమిషాల్లోనే మారిపోయిన వాతావరణం.. గాలి దుమారంతో బెంబేలెత్తించింది. ఆ వెంటనే భారీ వర్షం. ఊహించని విధంగా వాతావరణంలో మార్పులతో ప్రజలు కూడా భయాందోళనకు గురయ్యారు.

ప్రధాన రహదారులపై నీరు ప్రవహిస్తుండటంతో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. పలుచోట్ల చెట్లు విరిగిపడగా.. చర్లపల్లి పారిశ్రామికవాడ సహా అనేక ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నాచారం, మల్లాపూర్, సికింద్రాబాద్, బేగంపేట, పంజాగుట్ట, అమీర్ పేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కూకట్ పల్లి, హైటెక్ సిటీ, కోఠి, బర్కత్ పుర, నారాయణగూడ, ఉప్పల్, రామాంతాపూర్ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. ఈదురు గాలులతో కూడిన వర్షం ధాటికి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాప్రా, సైనిక్‌పురిలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది.

చార్మినార్, దిల్ ఖుష్ నగర్, ఎల్బీనగర్, చైతన్యపురి, వనస్థలిపురం, హయత్ నగర్ ప్రాంతాల్లోనూ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతుంది. గాలి దుమారానికి చాలా చోట్ల హోర్డింగ్స్ ఎగిరిపడ్డాయి. విద్యుత్ వైర్లు తెగిపోవటంతో కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షానికి చాలా చోట్ల రోడ్లపై నీళ్లు నిలిచాయి. రోడ్లపై విరిగిపోయిన చెట్లను తొలగించేందుకు జీహెచ్‌ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగారు. అత్యవసర బృందాలు నీళ్లు నిలిచే ప్రాంతాలకు వెళ్లి విరిగిపడిన చెట్లను తొలగించి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. వర్షం కారణంగా ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో లోతు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ నెమ్మదిగా వెళ్తున్న నేపథ్యంలో వాహనాలు నిలిచిపోయాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles