pawan announces northern-andhra tour details జనసేన పోరాట యాత్రకు ముహూర్తం ఫిక్స్..

Janasena uttarandhra tour details announced by pawan kalyan

pawan kalyan, janasena, Pawan Kalyan bus Yatra, pawan kalyan porata yatra, pawan kalyan press meet, pawan kalyan srikakulam yatra, pawan kalyan ichhapuram yatra, Pawan Kalyan uttatandhra yatra, Pawan Kalyan gangapooja, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan announces his uttarandhra tour details by name porata yatra, a bus tour begins from icchapuram in northern andhra from 20th of this month.

ITEMVIDEOS: జనసేన పోరాట యాత్రకు ముహూర్తం ఫిక్స్..

Posted: 05/17/2018 02:51 PM IST
Janasena uttarandhra tour details announced by pawan kalyan

ఉద్యమాలకు పుట్టినిల్లు అయిన శ్రీకాకుళం జిల్లా నుంచి తన ఉత్తరాంధ్ర పోరాట యాత్రను ప్రారంభించనున్నట్లు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న డిమాండ్ తో ఈ యాత్రను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల్లో ప్రత్యేక హోదా హామిని నిలబెట్టుకోవాలని కవాతు ప్రదర్శనను నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు పాలకుల నిర్వక్ష్యానికి గురవుతూ ఇంకా వెనకబాటుతనంలోనే వుండిపోయాయని విమర్శించారు.

వెనకబాటు తనం కేవలం ప్రజలకు, ప్రాంతాలకు పరిమితం అవుతుందే తప్ప.. నాయకుల దరికి మాత్రం వెళ్లడం లేదని.. ఇలా ఎందుకు జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. ఈ వెనకబాటుతనం సమస్యను ఇప్పుడే రూపుమాపేందుకు చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలకు మిగతా జిల్లాలకు మధ్య విధ్వేషాలు చెలరేగి.. అవి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలకు ఉరిగొల్పుతాయని  ఆయన అందోళన వ్యక్తం చేశారు. ఈ వెనుకబాటు తనానికి కొందరు పాలకుల నిర్లక్ష్యవైఖరే కారణమని పవన్ కల్యాణ్ విమర్శించారు.

విశాఖపట్నంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ  20న ఇచ్చాపురం నుంచి  యాత్ర ప్రారంభమవుతుందని పవన్‌ చెప్పారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో దాదాపు 45 రోజుల పాటు తన పోరాటయాత్ర కొనసాగుతుందన్నారు. యాత్రలో భాగంగా ప్రత్యేక రాష్ట్ర అమరవీరులకు పార్టీ నివాళులర్పిస్తుందని అన్నారు. మన రాష్ట్రంలో అమరవీరులకు కూడా నివాళులు అర్పించలేని దయనీయ స్థితి నెలకోందని ఆయన దుయ్యబట్టారు. జనసేన అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని 13 జిల్లాలో అమరవీరులకు స్థూపాలను నిర్మింపజేస్తామని పవన్ తెలిపారు.

 అలాగే.. రాష్ట్ర  ప్రభుత్వం గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నాలుగేళ్లు పూర్తైనా ఇప్పటికీ వాటి గురించి పట్టించుకోకపోవడం, స్థానిక సమస్యలను పూర్తి చేయకపోవడంపై తమ పార్టీ ప్రజల దృష్టికి తీసుకువెళ్లనుందని చెప్పారు. తద్వారా మున్ముందు ఏ పార్టీలు ప్రభుత్వాలను ఏర్పాటు చేసినా.. వారు రాజకీయ జవాబుదారి తనం ఇచ్చేలా.. జవాబుదారిగా వ్యవహరించేలా ప్రజలందరూ సహకరించాలని కోరారు. దీంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా సమస్యలను గుర్తించి, అధ్యయనం చేసి వాటి పరిష్కార మార్గాలు చూపుతామన్నారు. ఈ పోరాటయాత్రలో జనసేన మేనిఫెస్టో టీమ్‌ కూడా పాల్గొంటుందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  ichchapuram  srikakulam  porata yatra  bus yatra  andhra pradesh  politics  

Other Articles