Governor will Decide who will get chance to form government కర్ణాటక గవర్నర్ నిర్ణయమే కీలకం!

Karnataka governor will decide who will get chance to form government

Assembly elections in Karnataka, Karnataka news, Karnataka 2018 results, Karnataka Governor,Karnataka Assembly elections, Karnataka updates, Karnataka new, Karnataka elections, Karnataka 2018 elections, Karnataka Assembly results, Congress, BJP, JDS

Governor will Decide who will get chance to form Government

కర్ణాటక గవర్నర్ నిర్ణయమే కీలకం!

Posted: 05/15/2018 06:18 PM IST
Karnataka governor will decide who will get chance to form government

(Image source from: deccanchronicle.com)

కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఏ పార్టీకి క్లీయర్ మెజార్టీ తీసుకురాలేకపోయినా... బీజేపీ పార్టీకి మాత్రం అత్యధిక సీట్లను కట్టబెట్టింది. అధికార కాంగ్రెస్ రెండో స్థానంలో.. అందరూ ఊహించినట్లే జేడీయూ మూడో స్థానంలో వచ్చింది. అయితే విడివిడిగా గవర్నర్ ను కలిసి తాము ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని.. తమకు అవకాశం కల్పించాలని జేడీయూ, బీజేపీలు అప్పుడే విన్నపాలు మొదలుపెట్టాయి. అయితే ఎవరికి ముందు అవకాశాన్ని కల్పిస్తారు అనేది కీలకంగా మారింది.

కర్ణాటక గవర్నర్ విజూభాయ్ వాలా ఎన్నికల ఫలితాల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి మొదట అవకాశం కల్పిస్తారా..? లేదా జేడీయూకు అవకాశం కల్పిస్తారా? అనేది ఆయన నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. మామూలుగా అయితే మెజార్టీకి అవకాశం ఉన్న పార్టీకి అవకాశం కల్పిస్తారు. అయితే అది గవర్నర్ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. కాగా ఫలితాలు పూర్తిస్థాయిలో వెలువడక ముందే కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పరమేశ్వర్ గవర్నర్ ను కలిసేందుకు ప్రయత్నించారు. కానీ గవర్నర్ అందుకు అనుమతించకపోవడంతో వెనుదిరిగారు. మొత్తానికి కర్ణాటక రాజకీయాలు గవర్నర్ బంగ్లాకు చేరడంతో అందరిలో ఆసక్తినెలకొంది.

 
 
 

 

 
 
 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karnataka elections  BJP  Congress  JDS  

Other Articles