Kerala woman has a request for Facebook పెళ్లిళ్ల పేరయ్యగా కూడా మారాలి: యువతి వినతి వైరల్

Kerala woman searching for life partner on fb says end exploitation by sites and brokers

Facebook, Kerala, Mark Zuckerberg, Matrimonial ad, Jyothi, viral video, #fbMatrimony, matrimony sites, marriage brokers, exploitation, video viral

A message posted by 28-year-old Jyothi KG on Facebook to send out a request seeking probable groom has gone viral. She is a resident of Malappuram district in Kerala.

ITEMVIDEOS: ఫేస్ బుక్.. పెళ్లిళ్ల వేదికగా మారాలి: యువతి వినతి వైరల్

Posted: 05/03/2018 04:25 PM IST
Kerala woman searching for life partner on fb says end exploitation by sites and brokers

అవసరం అన్నింటిన్నీ నేర్పిస్తుంది. అవసరం అలోచనా శక్తిని కూడా పెంచుతుంది. అవసరాన్ని మించిన గురువు అంటూ ఎవరూ లేరు. ఈ మాటలు వింటుంటే ఔరా అనిపిస్తుందా..? మన పెద్దలు చెప్పినవే. అందకోనేమో ఓ అవసరం ఈ కేరళ అమ్మాయిని.. అమె పోస్టు చేసిన వీడియోను ఇప్పుడు నెట్టింట్లో సంచలనంగా మార్చింది. అదేంటి అంటారా..? ఫేస్ బుక్ అనగానే స్నేహితుల కోసమో లేక అభిప్రాయాలను షేర్ చేయడం కోసమో, స్నేహం కోసమో, లేక ఫోటోలు, వీడియోలు షేర్ చేసుడానికో ఉపయోగిస్తాం. కానీ ఈ కేరళ యువతి మాత్రం అందుకు భిన్నంగా వినియోగించింది. అంతేకాదు.. పేస్ బుక్ కు వ్యవస్థాపకుడికి కూడా ఓ సందేశాన్ని పంపింది.

అంతే ఈ యువతి పోస్టు ఓక్కసారిగా వైరల్ అయ్యింది. అసలింతకు ఈ యువతి ఫేస్ బుక్ ను ఎందుకు వినియోగించిందో తెలుసా.? తన జీవిత భాగస్వామిని అన్వేషించేందుకు. అమో అలోచనా విధానం నెట్ జనులను విస్మయానికి గురి చేసింది అంతే.. అందరూ అమె పోస్టును లైక్ చేస్తూ, కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు.. అమె పోస్టు చేసిన వీడియోను కూడా షేర్ చేసుకుంటూ వైరల్ చేస్తున్నారు. కేరళలోని మలప్పురం నగరానికి చెందిన కేజీ జ్యోతి గత వారం తన కోసం ఓ పెళ్లి ప్రకటన పోస్టు చేసింది. ‘‘ఫేస్‌బుక్‌మ్యాట్రిమోనీ’’ హ్యాష్ ట్యాగ్ తో తనకు తగిన వరుడిని చూసిపెట్టాలంటూ మిత్రులను కోరింది.

అంతేకాదు తన పోస్టులో ఈ మేరకు తన వీడియోను జతపర్చిన జ్యోతి.. తనకు కులం, జాతకాలతో పట్టింపు లేదనీ.. ఎలాంటి డిమాండ్లు లేవని చెబుతూ ఆమె పెట్టిన ఈ పోస్టు ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. ‘‘నేను ఒక్కదాన్నే. మీకు ఎవరైనా తెలిసిన మిత్రులుంటే చెప్పండి. నాకు ఎలాంటి డిమాండ్లూ లేవు. జాతకాలు, కులం కూడా ముఖ్యం కాదు. నా తల్లిదండ్రులు చనిపోయారు. ఫ్యాషన్ డిజైనింగ్‌లో నేను బీఎస్సీ చదివాను. వయసు 28 ఏళ్లు. నా సోదరుడు ముంబైలో సీనియర్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. చెల్లెలు సివిల్ ఇంజినీరింగ్ చదువుతోంది..’’ అంటూ ఆమె తన ప్రకటనలో పేర్కొన్నారు. పెళ్లి ప్రకనటలో భాగంగా తన ఫోటోని కూడా పోస్టుకు జతచేసింది.
 
ఏప్రిల్ 26న ఆమె పోస్టు చేసిన ఈ ప్రకటన ఇప్పటివరకు 6 వేల మందికి పైగా షేర్ చేసుకున్నారు. ఇప్పటికే చాలామంది ఆమెకు ప్రపోజ్ చేసినట్టు కామెంట్లను బట్టి తెలుస్తోంది. కాగా జ్యోతి పనిలో పనిగా ఫేస్‌బుక్ సీఈవో జుకెర్‌బర్గ్‌కి కూడా ఓ రిక్వెస్ట్ పెట్టింది. పెళ్లి బ్రోకర్లు, మ్యాట్రిమోనీ సైట్ల మోసాల నుంచి యువతను కాపాడేలా ఫేస్‌బుక్‌లో కూడా మ్యాట్రిమోనీ ఆప్షన్‌‌ పెట్టాలని కోరింది. ఇదే అంశంపై జుకెర్‌బర్గ్‌కు రాయాలంటూ తన ఫేస్‌బుక్ మిత్రులను కోరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Facebook  Kerala  Mark Zuckerberg  Matrimonial ad  Jyothi  #FbMatrimony  viral video  

Other Articles