man mortigages police station to fullfill his needs ఠాణానే తాకట్టు పెట్టి అప్పు తీసుకున్న ఘనుడు..

Man mortigages police station to fullfill his needs

nageshwar rao, ex surpanch, gonegandla, major gram panchayat, kurnool, police station, police quarters land, nagesh naidu, andhra pradesh, trending, viral news, crime

A Man, from andhra pradesh kurnool district, ex surpanch of gonegandla major gram panchayat has mortigaged police station for his needs, He had been arrested by the police and sent to judicial remand.

ఠాణాకే శఠగోపం.. తాకట్టు పెట్టి అప్పు తీసుకున్న ఘనుడు..

Posted: 05/03/2018 05:09 PM IST
Man mortigages police station to fullfill his needs

అనుకోకుండా వచ్చే ఖర్చులకు, అవసరాలకు డబ్బు కావలంటే ఏం చేస్తాం. నగో, నట్రో తాకట్టు పెడతాం. అయితే అంతకుమించిన అవసరం ఏర్పడితే.. పొలమో.. ఇల్లో.. బండో.. తాకట్లు పెడతాం. అప్పటికీ అవసరం తీరకపోతే.. బంధువులదో, స్నేహితుల అస్తులను కూడా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుంటాం.. కానీ ఓ దేశముదురు చేసిన పనిని చోబితే మీకు షాక్ అవుతారంతే.! డబ్బు అవసరమైన ఈ దేశముదురు వాళ్లవి.. వీళ్లవి కాకుండా ఏకంగా పోలీస్ స్టేషన్ (ఠాణా) తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నాడు. అయితే ప్రభుత్వం గతంలో చేసిన రుణమాఫీలలో ఈ అప్పు క్లియర్ అయినా.. మార్టిగేజ్ కింద నుంచి విముక్తి చేయడం మర్చిపోయాడు. అంతే ఎప్పుడో పాతికేళ్ల క్రితం చేసని తప్పు.. ఇప్పుడు శాపమై అతన్ని పట్టుకుంది. అసలే చట్టంతో అటలాడితే.. ఎవరైనా ఊచలు లెక్కబెట్టాల్సిందే అన్న డైలాగ్ గుర్తుకు తెస్తుంది.

అసలేం జరిగింది..? ఏమీటీ విషయం.. అంటారా..? వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా వున్న సమయంలో కర్నూలు జిల్లాకు చెందిన గోనెగండ్ల మేజర్ గ్రామపంచాయితీ మాజీ సర్పంచ్ టి.నాగేశ్వరరావు అలియాస్ నాగేష్ నాయుడు.. తనకు అత్యవసరంగా డబ్బు అవసరమై 1993వ సంవత్సరంలో గోనెగండ్లలోని 106, 35, 114, 452 సర్వే నెంబర్లపై సహకార సంఘం మార్టిగేజ్ కింద తాకట్టు పెట్టి రూ.10వేల అప్పు తీసుకున్నాడు. అందులో పోలీస్ స్టేషన్ కూడా ఉండటం విశేషం. గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 452లో పోలీస్ స్టేషన్ తోపాటు పోలీస్ శాఖకు కేటాయించిన 4.13 ఎకరాల భూమి కూడా ఉంది.

గోనెగండ్ల సింగిల్ విండో ద్వారా కోడుమూరు కేడీసీసీ బ్యాంక్ నుంచి రూ.10వేలు తీసుకున్నాడు. వైఎస్ హయాంలో ఏర్పడిన ప్రభుత్వం అప్పటి రైతుల పోందిన రుణాలను పూర్తిగా మాఫీ చేసింది. దీంతో పది వేల రూపాయలను తీసుకున్న నాగేష్ నాయుడు రుణం కూడా మాఫీ అయ్యింది. తాను తలచిందే దైవం కూడా తలచిందని అనందపడ్డాడు. దీంతో సంతోషపడిన నాయుడు.. అసలు విషయాన్ని మర్చిపోయాడు. మార్టిగేజ్ లోన్ కు చెందిన ఒప్పందాన్ని కోడుమూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రద్దు చేయించలేదు. దీంతో డబ్బు విషయంలో అన్ని తీరిపోయినా.. తాకట్టు పెట్టి అప్పుగా రుణం పొందినట్లు మాత్రం డాక్యూమెంట్లో స్పష్టంగా వుంది.

ఇటీవల పోలీస్ శాఖ సిబ్బంది క్వార్టర్స్ పున:నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి కోడుమూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో ఈసీ తీయించారు. పోలీస్ స్టేషన్ తోపాటు ఆ స్థలం కూడా తాకట్టు ఉందని తెలిసి షాక్ అయ్యారు. విషయంపై విచారణ చేస్తే.. గోనెగండ్ల మేజర్ పంచాయతీ మాజీ సర్పంజ్ నిర్వాకం అని తేలింది. ఈ తతంగంపై కేసు నమోదు చేసి.. నిందితుడుని అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్ ను తాకట్టు పెట్టి మరీ బ్యాంక్ అప్పు తీసుకోవటం బహుశా దేశంలో ఇదే కావొచ్చు అంటున్నారు..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles