చెడు వ్యసనాలకు లొంగిన ఓ నటుడు తన దారిని మార్చుకుని దొంగగా మారాడు. చోరీలు చేయడంలో అరితేరాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నిజమైన చోరులు కూడా చేయనన్ని దొంగతనాలు చేసి.. వాటిని తాకట్టు పెట్టి వచ్చిన డబ్బులతో జల్సాలు చేశాడు. తనను దొంగగా మార్చింది మాత్రం చెడు వ్యసనాలేనని చెబుతున్న ఈ టీవీ నటుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అరదండాలు వేశారు. దొంగతనాలు చేయడంలో దిట్టగా మారిన అతడు వివిధ ప్రాంతాల్లో లెక్కలేనన్ని దొంగతనాలకు పాల్పడ్డాడు.
పోలీసుల కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని లక్కారం రోడ్డు ప్రాంతానికి చెందిన బారి నాగరాజు (23) అలియాస్ నరేందర్ అలియాస్ గుంటూరు నరేంద్ర డిగ్రీ చదువుకి మధ్యలోనే స్వస్తి చెప్పి సెంట్రింగ్ కార్మికుడిగా మారాడు. అనంతరం పెళ్లి చేసుకుని 2016లో హైదరాబాద్‌కు మకాం మార్చాడు. సినీ రంగంపై ఉన్న మోజుతో ప్రముఖ స్టూడియోలో కొంతకాలం ప్రొడక్షన్ విభాగంలో పనిచేశాడు. ఈ క్రమంలో ఓ హాస్య నాటికలో నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత వ్యసనాలకు అలవాటు పడి డబ్బులు చాలక ఇబ్బంది పడ్డాడు.
దీంతో దొంగగా మారాడు. దొంగిలించిన నగలను గోల్డ్‌లోన్ సంస్థల్లో తాకట్టు పెట్టి రుణం తీసుకునేవాడు. హుజూర్ నగర్లో నాలుగు బైకులు చోరీ చేశాడు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని చైతన్యపురి, సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 16 చోరీలు చేశాడు. ఈ క్రమంలో చైతన్యపురి పోలీసులకు చిక్కాడు. అతడి నుంచి రూ.14,52,500 విలువైన 72 తులాల బంగారు ఆభరణాలు, 310 గ్రాముల వెండి నగలను స్వాధీనం చేసుకున్నారు. నాగరాజుపై పీడీ చట్టాన్ని ప్రయోగించినట్టు రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ ఎం.భగవత్ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more